జాతీయ వార్తలు

పార్లమెంట్‌లో రాహుల్ విస్తృతంగా మాట్లాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్

ముంబయి, డిసెంబర్ 26: గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపాలైన తర్వాత పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చాలా పరిణితి సాధించారని, అయినప్పటికీ పార్లమెంట్‌లో బిజెపిని నిలదీసేందుకు ఆయన ఇంకా ఎంతో దూకుడుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథీరాజ్ చవాన్ స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో రాహుల్ మరింత ఎక్కువగా మాట్లాడటంతోపాటు ప్రజల్లో విశ్వసనీయతను పెంపొందించుకునేందుకు తన హావభావాలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చవాన్ అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారం అవుతున్నందున రాహుల్ ముక్తసరిగా ఒకటి రెండు మాటలు మాట్లాడితే సరిపోదని, వివిధ అంశాలపై ఆయన విస్తృతంగా ప్రసంగిస్తూ ఏకధాటిగా 45 నిమిషాల నుంచి గంటసేపు మాట్లాడాల్సిన అవసరం ఉందని చవాన్ పేర్కొన్నారు. వివిధ సమస్యలను ప్రస్తావించేందుకు ప్రతిపక్ష నాయకులకు గల ఏకైక మార్గం పార్లమెంటేనని ఆయన తెలిపారు. అధికారంలో లేనివారు ప్రధాన మంత్రిని కలసి ప్రజలకు అనుకూలంగా లేని నిర్ణయాలను పునస్సమీక్షించాల్సిందిగా కోరడం తప్ప ప్రజలకు చేయగలిగింది ఏమీ ఉండదని, కనుక విపక్ష నాయకులకు గల ఏకైక మార్గం పార్లమెంటేనని చవాన్ పిటిఐ వార్తా సంస్థతో అన్నారు.