రాష్ట్రీయం

పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రైవేటీకరణ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పావులు కదుపుతున్న ఏపి సర్కార్
కొత్త విధానంతో ఏటా రూ. 34 కోట్ల నష్టం
ఆందోళనలో వెబ్ ఆఫ్‌సెట్ ప్రింటర్లు
హైదరాబాద్, డిసెంబర్ 24: రాజకీయ నాయకుల ప్రమేయం, బడా పారిశ్రామికవేత్తల ఒత్తిళ్లతో ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ముద్రణ పక్కదారి పడుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలకు ఉచితంగా అందించే పాఠ్య పుస్తకాల ముద్రణకు కొత్త టెండర్ల ప్రక్రియను ఖరారు చేసే యోచనలో ఉంది. ఇప్పటివరకూ పుస్తకాల ముద్రణను మాత్రమే ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేది. కాగితం సరఫరా మొదలు పుస్తకాల పంపిణీ వరకూ అన్నీ ప్రభుత్వమే చేసేది. ఇకపై ఈ మొత్తం ప్రక్రియను ప్రైవేటుపరం చేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దీని వల్ల ఏటా రూ. 34 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అయినా ప్రభుత్వం ముందుకు వెళ్లడానికే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ముద్రణ టెండర్‌ను పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ సంస్థకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైపోయిందనే ఆరోపణలు కూడా వినవస్తున్నాయి. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే, చిన్నతరహా పరిశ్రమలు మూతపడి ఐదు వేల కుటుంబాలు ఉపాధి కోల్పోయి వీధినపడే ప్రమాదం నెలకొంది.
ప్రభుత్వం పాఠ్యపుస్తకాల ముద్రణకు పబ్లిషర్లను, పుస్తకాల ముద్రణకు అవసరమయ్యే కాగితానికి వేర్వేరుగా ఎంపిక చేసి నాణ్యతతో కూడిన పుస్తకాలను ముద్రించి జిల్లా కేంద్రాల డిపోల ద్వారా పాఠశాలలకు పంపిణీ చేసేది. ఈ ప్రక్రియ ఉమ్మడి రాష్ట్రంలో కూడా కొనసాగింది. రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా అదే ప్రక్రియలో కొనసాగింది. 2014-15లో కూడా పుస్తకాల పంపిణీ కొనసాగింది. ఈ ప్రక్రియను కొనసాగించకుండా కొందరు రాజకీయ నాయకులు, బడా పారిశ్రామికవేత్తల ప్రోద్బలంతో ప్రభుత్వం కొత్తగా టెండర్లను ఆహ్వానించేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. గత సంవత్సరం పబ్లిషర్లకు పుస్తకాల ముద్రణకు అవకాశం ఇస్తే ఒక పేజీకి (కాగితంతో సహా) 17.5 పైసలు ఖర్చు కాగా కొత్త పద్ధతిలో పేజీకి 23.24పైసల ఖర్చవుతుందని పబ్లిషర్లు చెబుతున్నారు. ప్రభుత్వం సుమారు 600 కోట్ల పేజీలను (12 వేల టన్నుల కాగితం) ముద్రించనుంది. ఇందుకు సుమారు రూ. 103 కోట్లు ఖర్చయితే, కొత్త టెండర్లతో రూ. 137 కోట్లు ఖర్చవుతుంది. అంటే ప్రభుత్వానికి దాదాపు ఏటా రూ. 34కోట్ల నష్ట వాటిల్లుతుందని భీమవరానికి చెందిన ఓ పబ్లిషర్ తెలిపారు. ఇటీవల వయోజన విద్యా విభాగానికి చెందిన టెండర్‌లో కూడా 23 పైసలకు ఒక పేజీ చొప్పున కేటాయిస్తూ ఆర్డర్లు ఇచ్చినట్టు తెలిసింది. ఈ టెండర్లతో ప్రభుత్వ పుస్తకాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేయాల్సిన దుస్థితి. ఇప్పటివరకు గ్రేడ్ ‘ఏ’గా ముద్రించిన పుస్తకాల నాణ్యత కూడా తగ్గే ప్రమాదం ఉందనీ, అయినా ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోవడం లేదని సదరు పబ్లిషర్ వాపోయారు. రాష్ట్రంలో ప్రభుత్వ పుస్తకాల ముద్రణపై ఆధారపడి జీవిస్తున్న సుమారు ఐదు వేల కుటుంబాలు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని, చిన్న, మధ్య తరహా పబ్లిషర్లు తమ పరిశ్రమలను మూసివేసుకునే దుస్థితిని కల్పిస్తున్న కొత్త టెండర్ల ప్రక్రియను ఉపసంహరించుకోవాలని, పాత పద్దతిలోనే టెంటర్లను కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ వెబ్ ఆఫ్‌సెట్ ప్రింటర్ల అసోసియేషన్ కోరుతోంది.