జాతీయ వార్తలు

ఆదర్శ అధ్యాపకుడు కోనేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు
రామకృష్ణరావు పుస్తకం ఆవిష్కరణ
న్యూఢిల్లీ, మార్చి 14: గీతం యూనివర్శిటీ చాన్స్‌లర్ డాక్టర్ కోనేరు రామకృష్ణరావు జీవితంపై రచించిన ‘ఏజ్‌లెస్ మైండ్ అండ్ టైమ్‌లెస్ ఐడియాస్’ అనే పుస్తకాన్ని సోమవారం సాయంత్రం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఢిల్లీలోని వెంకయ్య నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో అరాచకం అశాంతి పెరిగాయని, ఈ నేపథ్యంలో దేశంలో తిరిగి భారతీయ సంస్కృతి పద్ధతులు అనుసరించాలని కోరారు. వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రజ్ఞాపాటవాలు కలిగి జీవితకాలం నిలిచే ఆచరణాత్మకమైన ఆలోచనలు కలిగిన ఆదర్శ అధ్యాపకుడు, పరిశోధకుడు అని కోనేరును వెంకయ్య కొనియాడారు. అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా పారాసైకాలజీలో విశిష్ఠ వ్యక్తిగా గుర్తింపు పొందిన భారత సైకాలజీ పితామహుడు అని కోనేరును వెంకయ్య పొగిడారు. ఈ కార్యక్రమానికి ఆచార్య లక్ష్మి ప్రసాద్ అధ్యక్షత వహించగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కోనేరు రామకృష్ణరావుకు అభినందనలు తెలిపారు.