రాష్ట్రీయం

ప్రాజెక్టులపై ఇక పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్రాష్ట్ర జల వివాదాలపై సర్కార్ దృష్టి
అభ్యంతరాలు లేకుండా రీ-డిజైన్
మహారాష్టత్రో రాజీ, ఆంధ్రతో దోస్తి
యాగం తర్వాత ముంబైకి కెసిఆర్
జనవరి నెలాఖరులో పనులు ప్రారంభం

హైదరాబాద్, డిసెంబర్ 24: తెలంగాణను సస్యశ్యామలం చేసే భారీ నీటి పారుదల ప్రాజెక్టుల దిశగా తెరాస ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏళ్లతరబడి అంతూపొంతూ లేకుండా సాగుతున్న ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి ఉద్దేశిత ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలన్న బృహత్తర లక్ష్యం దిశగా చురుగ్గా అడుగేస్తోంది. ప్రస్తుతం చేపట్టిన చండీయాగం పూర్తయిన వెంటనే ప్రాజెక్టులపై చురుగ్గా ముందుకు సాగేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుసమాయత్తమవుతున్నారు. ఇటీవల మహారాష్టత్రో కుదిరిన ఒప్పందం, అలాగే ఇతరత్రా తలెత్తుతున్న అవరోధాలను అధిగమించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. వివాదాస్పన ప్రాజెక్టులకు సంబంధించి ఏర్పడ్డ అవరోధాలను తొలగించుకుంటూ ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సఖ్యతను పెంపొందించుకోవడం ద్వారా నీటి ప్రాజెక్టులకు సత్వరమే జలకళ తీసుకురావాలన్నది సిఎం ఆశయం. భారీ ప్రాజెక్టుల నిర్మాణాలకు తలెత్తుతున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై తెలంగాణ ప్రభుత్వం క్షుణ్ణంగా ప్రభుత్వం అధ్యయనం చేసింది. ఇతర రాష్ట్రాలతో వివాదాలు, అభ్యంతరాలు లేనిపక్షంలో ప్రాజెక్టులకు కేంద్ర నుంచి అనుమతులు రావడం పెద్ద సమస్యే కాదన్నదన్నది తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అభిప్రాయం. ఏళ్ళతరబడిగా భారీ నీటిపారుదల ప్రాజెక్టులు ముందుకు సాగకపోవడానికిగల పై కారణాలను ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం కల సాకారం కావడంతో ఇక రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి భారీ ప్రాజెక్టులను నిర్మించడంతో పాటు పెండింగ్ ప్రాజెక్టులను సతర్వం పూర్తి చేయడం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పెండింగ్ ప్రాజెక్టులతో పాటు కొత్తగా నిర్మించబోయే ప్రాజెక్టులకు ఎగువ రాష్ట్రాల అభ్యంతరాలపై తక్షణం పరిష్కరించుకునే దిశగా ప్రభుత్వం దృష్టిసారించింది. గోదావరిపై ఆదిలాబాద్ జిల్లా తమ్మిడిహట్టి వద్ద కరీంనగర్ జిల్లా కాళేశ్వరం వద్ద నిర్మించనున్న ప్రాణహిత ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్ననీస్‌తో స్వయంగా మాట్లాడారు. తుమ్మిడిహట్టి వద్ద నిర్మించే బ్యారేజిని 153 మీటర్ల ఎత్తులో నిర్మించే ప్రతిపాదనను మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇంత ఎత్తులో నిర్మాణం జరిగితే తమ రాష్ట్రాలో చాలా ప్రాంతం ముంపునకు గురి అవుతుందని మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే తప్ప తాము ఎట్టిపరిస్ధితుల్లో ఒప్పుకోబోమని గతంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీంతో తక్కువ ముంపు, ఎక్కువ లబ్ధి ప్రాతిపదికన డిపిఆర్ (డిటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) ఇవ్వాల్సిందిగా వ్యాప్కోస్ సంస్థను తెలంగాణ ప్రభుత్వం కోరింది. ప్రాజెక్టు ఎత్తును 148 మీటర్లకు తగ్గించడం వల్ల మహారాష్ట్రంలో ముంపు నామమాత్రంగా ఉంటుందని వ్యాప్కోస్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారమే తాము ప్రాజెక్టు నిర్మించుకుంటామని దీని వల్ల ముంపు నామమాత్రమే జరుగుతుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఫడ్ననీస్‌కు ముఖ్యమంత్రి కెసిఆర్ ఫోన్లో వివరించగా, ఆయన సానుకూలంగా స్పందిస్తూ అలాగైతే తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అలాగే కోరినంత మేరకు ముంపు ప్రాంతానికి నష్టపరిహారం చెల్లించడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దీంతో గోదావరిపై నిర్మించబోయే భారీ ప్రాజెక్టుకు ఎగువ రాష్ట్రం మహారాష్టత్రో అభ్యంతరాలు దాదాపు తొలిగిపోయినట్టే. ఈ అంశంపై ఒప్పందం కుదుర్చుకోవడానికి త్వరలో వచ్చి చర్చిస్తానని ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ప్రతిపాదనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అంగీకరించారు. గోదావరి నదిపై నిర్మించబోయే ప్రాజెక్టుకు ఎగువ ప్రాంత మహారాష్ట్ర, చత్తీస్‌గడ్ రాష్ట్రాలతో అభ్యంతరాలు ఉంటే, కృష్ణానది నిర్మించే ప్రాజెక్టులకు దిగువ ప్రాంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. కృష్ణాపై నిర్మించబోయే భారీ ప్రాజెక్టు పాలమూర్-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అనుమతి ఇవ్వవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి, కేంద్ర జల సంఘానికి లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌తో సఖ్యతగా లేకుంటే కృష్ణానదిపై నిర్మించే ప్రాజెక్టులకు అనుమతి కష్టమేనన్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం గ్రహించింది. కృష్ణానది యజమాన్య బోర్డు సమావేశంలో గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభ్యంతరాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇటీవల వెనక్కి తగ్గింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు, కృష్ణా జలాల వినియోగంలో గతంలో లేవనెత్తిన అభ్యంతరాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తోంది. కృష్ణాడెల్టాకు నీటి విడుదలతో పాటు తాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ పరిణామం భవిష్యత్‌లో కృష్ణానదిపై నిర్మించబోయే భారీ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అభ్యంతరాలు లేకుండా దోహదం చేస్తుందని తెలంగాణ ప్రభుత్వం విశ్వసిస్తుంది.