ప్రకాశం

ఆస్తిలో వాటా అడిగినందుకు అన్నను చంపిన తమ్ముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొమరోలు, జనవరి 1: తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా అడిగిన అన్నను తమ్ముడు హత్య చేసిన సంఘటన గురువారం అర్థరాత్రి మండలంలోని పామూరుపల్లిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు పామూరుపల్లి గ్రామానికి చెందిన పాలుగుళ్ళ రామసుబ్బారెడ్డి జయమ్మలకు రామకృష్ణారెడ్డి, శివరామిరెడ్డి అనే ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా, తండ్రి రామసుబ్బారెడ్డి మృతిచెందాడు. పెద్దకుమారుడైన రామకృష్ణారెడ్డికి 2010లో వివాహం కాగా, ఏడాది తరువాత భార్యకు విడాకులు ఇచ్చి పామూరుపల్లిలో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. రెండవ కుమారుడు శివరామిరెడ్డికి 2012లో వివాహం కాగా ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లి జయమ్మ చిన్నకుమారుడి వద్ద ఉంటుంది. ఒంటరిగా ఉంటున్న రామకృష్ణారెడ్డికి రావాల్సిన సగం ఆస్తిని ఇచ్చేందుకు శివరామిరెడ్డి, తల్లి జయమ్మ సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీంతో రామకృష్ణారెడ్డి వారిపై ఒత్తిడి తెస్తూ వచ్చాడు. కాగా, ఈ విషయమై అన్నదమ్ముల మధ్య తరచుగా ఘర్షణలు జరిగేవి. గురువారం ఉదయం పొలంలో ఉన్న శివరామిరెడ్డి వద్దకు వెళ్ళిన రామకృష్ణారెడ్డి తనకు తప్పనిసరిగా తన వాటా ఇవ్వాలని, లేకుంటే నీ అంతు చూస్తానని బెదిరించి వచ్చాడు. కాగా, గురువారం రాత్రి చిన్న కుమారుడి ఇంటిలో నిద్రిస్తున్న తల్లి జయమ్మ వద్దకు రామకృష్ణారెడ్డి వెళ్ళి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తుండగా అప్పటికే అన్నను చంపాలని పథకం వేసుకొని ఉన్న శివరామిరెడ్డి అదే అదునుగా భావించి తన ఇంటిలో ఉన్న కత్తితో అన్న రామకృష్ణారెడ్డిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. గాయపడిన రామకృష్ణారెడ్డిని 108వాహనంలో గిద్దలూరు వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడని తల్లి జయమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమేరకు కేసు నమోదు చేయగా గిద్దలూరు సిఐ మహ్మద్ ఫిరోజ్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోందని ఎస్సై టి బాలకృష్ణ తెలిపారు.

ఉత్సాహంగా పోలురాదా ఎడ్ల పోటీలు
చీరాల, జనవరి 1: నూతన సంవత్సరం సందర్భంగా శ్రీ కృష్ణ యాదవ యూత్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని బోయినవారిపాలెం గ్రామంలో రాష్టస్థ్రాయి పోలురాదా ఎడ్ల పోటీలను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ఎడ్ల జతలు పోటీపడ్డాయి. 10 నిమిషాల్లో మూడు క్వింటాళ్ల బరువును ఎక్కువ దూరం లాగిన ఎడ్లకు ప్రథమ బహుమతి రూ.12,000, ద్వితీయ బహుమతి రూ. 10,000, మూడవ బహుమతి రూ.7000, నాలుగవ బహుమతి రూ.5000 అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలను తిలకించేందుకు అధిక ఖ్యలో ప్రజలు తరలి వచ్చారు.