రాష్ట్రీయం

రూ.1200 కాదు 101 కడితే చాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్తి పన్నుపై భారీ రాయితీ
ఆదేశాలు జారీ చేసిన సర్కార్
హైదరాబాద్, డిసెంబర్ 31:మహానగర పాలక సంస్థ ఎన్నికలను పురస్కరించుకుని జంటనగరవాసులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన వరాలు ఒక్కొక్కటి అమలవుతున్నాయి. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ. 1200 ఆస్తిపన్ను చెల్లించే వారు ఇకపై రూ. 101 చెల్లించే విధంగా, పన్ను రాయితీ ప్రతిపాదనను ఆమోదిస్తూ సర్కారు గురువారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ప్రస్తుతం ఆస్తిపన్ను చెల్లిస్తున్న సుమారు 13లక్షల పై చిలుకు బకాయిదారుల్లో రూ.1200లోపు చెల్లించే 5లక్షల 10వేల మంది బకాయిదారులకు లబ్ధి చేకూరనుంది. దీంతో జిహెచ్‌ఎంసిపై వర్తమాన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.29 కోట్లు భారం పడుతుంది. ఇక ఇదే తరహాలో ఆస్తిపన్ను చెల్లించే బకాయిదారుల గత కొద్దిసంవత్సరాల బకాయిలను గమనిస్తే గ్రేటర్‌పై సుమారు రూ.89 కోట్ల వరకు ఆర్థిక భారం పడే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఒకవైపు అధికారులు ప్రస్తుతమున్న అన్ని ఆదాయమార్గాలను సద్వినియోగం చేసుకుని కార్పొరేషన్‌ను ఆర్థికంగా మరింత పరిపుష్టి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో.. ఏకంగా 5లక్షల 10వేల మంది బకాయిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా సర్కారు తీసుకున్న నిర్ణయం పట్ల పేద, మధ్య తరగతి ప్రజల్లో ఒకింత హర్షం వ్యక్తమవుతున్నా, ఆదాయాన్ని సమకూర్చేందుకు మల్లగుల్లాలు పడుతున్న అధికారులు ఈ ఆర్థిక భారాన్ని పూడ్చుకునేందుకు ఎలాంటి మార్గాలను అనే్వషించాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.