రాష్ట్రీయం

సోనియా, రాహుల్‌పై కేంద్ర ప్రభుత్వ వేధింపులకు కాంగ్రెస్ నేతల నిరసన, అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 19: ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కేంద్ర ప్రభుత్వం వేధిస్తున్నదని ఆరోపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నిరసన ధర్నాలు నిర్వహించగా పోలీసులు అరెస్టు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ (జిహెచ్‌సిసి) అధ్యక్షుడు దానం నాగేందర్ అధ్వర్యంలో శనివారం నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీ ఎంపీలు వివేక్, అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే గీతారెడ్డి తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధర్నాలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో సోనియా, రాహుల్ గాంధీలను వేధించేందుకు కేంద్రం కుట్ర పన్నిందని విమర్శించారు. కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడడాన్ని మానుకోకపోతే తాము ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సమయంలో పోలీసులు వారిని అరెస్టు చేసి ఆబిడ్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
మరోవైపు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లేశం అధ్వర్యంలో లక్‌డీకాపూల్‌లోని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గాంధీ భవన్ ఎదుట మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరేళ్ళ శారద అధ్వర్యంలో మహిళా కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ప్రధాని దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.
(చిత్రం) హైదరాబాద్ నెక్లెస్ రోడ్డుపై నిరసన ప్రదర్శన చేస్తున్న కాంగ్రెస్ నేత దానం నాగేందర్, పార్టీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్న పోలీసులు