రాష్ట్రీయం

సైకో మధు బెయిల్ పిటిషన్ తిరస్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 24: ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ పేరుతో ఎంతోమంది విద్యార్థినులపై, ఉద్యోగాల పేరుతో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన సైకో మధు బెయిల్ పిటిషన్‌ను మంగళవారం రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది. ఫుడ్ కార్పొరేషన్ మాజీ ఉద్యోగి కలకంద మధు 300మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, మరికొందరు మహిళలపై అత్యాచార యత్నానికి ఒడిగట్టిన అభియోగాలపై షీ టీం, సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా సైకో మధు బెయిల్‌పై దాఖలైన పిటిషన్‌పై పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి రాంరెడ్డి సవాల్ చేస్తూ, ఎంతోమంది విద్యార్థినుల జీవితాలతో చెలగాటమాడుతూ, దాదాపు 5వేల మంది విద్యార్థినుల వివరాలు సేకరించి వారిపై లైంగిక, శారీరకంగా హింసకు గురిచేసిన అతని బెయిల్‌ను నిరాకరించాలని కోరారు. మధు అరాచకాలపై దర్యాప్తు కొనసాగతున్నందున అతని బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ హైకోర్టు జస్టిస్ ఇ రాజా తీర్పు చెప్పారు.