రాష్ట్రీయం

కాకినాడ ‘ఎల్‌ఎన్‌జి’పై భిన్నాభిప్రాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాడివేడిగా ప్రజాభిప్రాయ సేకరణ
కాకినాడ, నవంబర్ 21: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తీరంలో ఏర్పాటుచేయనున్న ఎల్‌ఎన్‌జి టెర్మినల్‌పై శనివారం కాకినాడ డైరెక్టర్ ఆఫ్ పోర్ట్ కార్యాలయ ఆవరణలో శనివారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఆయా వర్గాల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సమావేశం ఆధ్యంతం వాడివేడిగా సాగింది. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ అభిప్రాయ సేకరణకు జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్, ఎల్‌ఎన్‌జి టెర్మినల్ ప్రాజెక్ట్ నిర్వాహకుడు డాక్టర్ కామేశం, పోర్ట్ డైరెక్టర్ వి రవికుమార్ తదితరులు హాజరయ్యారు. కాకినాడ పోర్టులో ప్రతిపాదించిన ఆఫ్‌షోర్ ఎల్‌ఎన్‌జి ఫ్లోటింగ్ టెర్మినల్ అండ్ రీగాసిఫికేషన్ యూనిట్ ఏర్పాటుపై ఈ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు.
కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం ఇక్కడ ఈ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నామని, ఆయా వర్గాల నుండి సేకరించిన అభిప్రాయాలను రికార్డ్ చేసి, డాక్యుమెంట్ రూపంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖకు పంపుతామని స్పష్టం చేశారు. పర్యావరణ, ఇతర అంశాలన్నిటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఈ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం అనుమతులు జారీ చేస్తుందని, ఈ విషయంలో ప్రజలకు ఏ విధమైన అపోహలు అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్వాహకుడు డాక్టర్ కామేశం మాట్లాడుతూ సుమారు 1200కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌ను ఇక్కడ ఏర్పాటుచేయనున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటైతే అనేక గ్యాస్ ఆధారిక పరిశ్రమలు వచ్చేందుకు మార్గం సుగమం అవుతుందని అన్నారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న వివిధ వర్గాలకు చెందిన వారు ప్రాజెక్టుపై అనేక సందేహాలు వ్యక్తం చేశారు.
స్థానిక మత్స్యకార నాయకుడు జి దాసు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు వలన స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. కాకినాడ మెకనైజ్డ్ బోట్స్ యజమానుల సంఘం మాజీ అధ్యక్షుడు కామాడి నూకరాజు మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ వస్తే మత్స్యకారులకు నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రమేష్ అనే మత్స్యకార ప్రతినిధి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుపై అవగాహన లేనివారిని, కిరాయి విధానంలో తీసుకువచ్చి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.
సత్యనారాయణమూర్తి, కొండలరావు అనే స్థానికులు మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే స్థానికులకు ఉపాధి కల్పించాలని కోరారు. పత్రికాప్రతినిధులు, ప్రజా సంఘాల ప్రతినిధులు కూడా ఈ ప్రాజెక్టు ఏర్పాటు పట్ల తమ సందేహాలు వ్యక్తం చేశారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో రాష్ట్ర కాలుష్య మండలి పర్యావరణ ఇంజనీర్ రవీంద్ర మాట్లాడుతూ మొత్తం 17 మంది తమ అభిప్రాయాలను చెప్పారని, వీటన్నిటినీ రికార్డ్ చేసి, మినిట్స్ రూపంలో కేంద్ర పర్యావరణ, మంత్రిత్వశాఖకు పంపుతామని చెప్పారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, అధికారులు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు.