హైదరాబాద్

ప్రజారవాణా వ్యవస్థను వినియోగించుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/గచ్చిబౌలి, డిసెంబర్ 17: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఉద్యోగులు ప్రజారవాణా వ్యవస్థను వినియోగించుకోవాలని సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ సూచించారు. ఐటి ఉద్యోగుల సౌకర్యార్థం కార్ ఫ్రీ డే రోజు మరిన్ని అదనపు బస్సులు నడిపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గురువారం ‘కార్ ఫ్రీ డే’ సందర్భంగా ఆయన ఎస్‌ఎస్‌సి, ఐటి ఉద్యోగుల సంయుక్త్ధ్వార్యంలో నిర్వహించిన ‘సైకిల్ విత్ సిపి’ని పురస్కరించుకొని ‘రహెజా పార్కు నుంచి సైబరాబాద్ కమిషనరేట్’ కార్యాలయం వరకు కమిషనర్ సివి ఆనంద్ సైకిల్ తొక్కారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో వాహనాలు పెరిగిపోవడం వల్ల ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతుండటంతోపాటు కాలుష్యం పెరిగిపోతుందన్నారు. భవిష్యత్తులో మంచి గాలి, నీరు తీసుకోలేని పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని, అలాంటి పరిణామాలను ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కూకట్‌పల్లి, మియాపూర్‌లతోపాటు వివిధ ప్రాంతాల నుంచి ఐటి కారిడార్‌కు వచ్చే ఉద్యోగులు ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నారని, పలు ఫిర్యాదులు కూడా వస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ కౌన్సిల్, హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘కార్ ఫ్రీ థర్స్ డే’ను నిర్వహించడం జరిగిందని, దీనిపై ఉద్యోగులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సమస్య ప్రధానంగా మారిందని, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఢిల్లీ లాంటి నగరాల్లో ప్రత్యేక చర్చ జరుగుతుందని సిపి ఆనంద్ తెలిపారు. నాలుగు నెలల క్రితం ప్రారంభమైన ‘కారు ఫ్రీ థర్స్‌డే’పై సోషల్ మీడియాలో ప్రత్యేక అంశంగా మారి చర్చజరుగుతుందన్నారు. సైబరాబాద్‌ను ఆదర్శంగా తీసుకొని ఢిల్లీ, గుర్గావ్, కర్నల్ నగరాల్లో కూడా కార్ ఫ్రీ డేను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారని కమిషనర్ తెలిపారు. మాదాపూర్ పరిధిలోని ఐటి కారిడార్‌లో సుమారు నాలుగు లక్షల మంది ఐటి ఉద్యోగులున్నారని, ఒక ఉద్యోగి ఒక కారు తెస్తే ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని అందుకోసం కారు ఫ్రీ థర్స్‌డేను అమలు చేస్తున్నామని కమిషనర్ ఆనంద్ వివరించారు. దీనిపై ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు విస్తృత ప్రచారం నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డిసిపి కార్తికేయ, ట్రాఫిక్ విభాగం అధికారి అవినాష్ మొహంతి, భరణితోపాటు పలు సంస్థల్లో పనిచేస్తున్న ఐటి సంస్థల ఉద్యోగులు, ప్రతినిధులు పాల్గొన్నారు.