జాతీయ వార్తలు

గవర్నర్‌తో నారాయణస్వామి భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుదుచ్చేరి: కాంగ్రెస్ శాసనసభా పక్షం నేతగా ఎన్నికైన నారాయణ స్వామి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమేనని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్ బేడీని సోమవారం కలిసిన సందర్భంగా తెలిపారు. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, డిఎంకె కూటమి మెజారిటీ సీట్లను సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా నారాయణస్వామి పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఇదివరకే ఖరారు చేసింది. సిఎల్‌పి తీర్మానాన్ని, ఎమ్మెల్యేల జాబితాను ఆయన కిరణ్ బేడీకి అందజేశారు. మంత్రివర్గం ఏర్పాటుక ఇక గవర్నర్ నుంచి నారాయణస్వామికి పిలుపురావడం లాంఛనమే. పిసిసి అధ్యక్షుడు నమశ్శివాయంతో తాను దిల్లీ వెళ్లి సోనియా, రాహుల్‌లను కలిసి మంత్రుల పేర్లను ఖరారు చేస్తామని నారాయణస్వామి తెలిపారు.