రాష్ట్రీయం

ఉచితంగా పంపుసెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైతులకు చంద్రబాబు కానుక దశలవారీగా పంపిణీ చేస్తామని వెల్లడి
హైదరాబాద్, డిసెంబర్ 31:రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్ల ప్రామాణికతను పెంచేందుకు సామర్ధ్యంతో కూడిన పంపుసెట్లను రైతులకు సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశలవారీగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. రైతాంగానికి రూ.50 వేల విలువ చేసే ప్రామాణికత ఉన్న పంపుసెట్లను ఉచితంగా పంపిణీ చేస్తారు. రాష్ట్రంలో 14 లక్షల సాధారణ వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. వీటిని మార్చేందుకు రూ.7500 కోట్లు ఖర్చవుతుంది. ప్రయోగాత్మకంగా తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరంలో 2500 విద్యుత్ పంపుసెట్లను అమర్చారు. దీని వల్ల 30 శాతం విద్యుత్ ఆదా అవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయానికి సాలీనా పదివేల ఎంయు విద్యుత్ ఖర్చవుతోంది. ప్రామాణికత ఉన్న పంపుసెట్ల వల్ల తక్కువ సమయంలోనే అధిక నీటిని పంపింగ్ చేయవచ్చు. విద్యుత్ రంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్సులో గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22 మిలియన్ యూనిట్ల లోటుతో అస్తవ్యస్త విద్యుత్ ఉండేదని, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిగులు విద్యుత్ సాధించామన్నారు. అందరికీ విద్యుత్ విధానాన్ని పటిష్టమైన ప్రణాళికతో అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో సోలార్ వెలుగులను నింపేందుకు అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో విద్యుత్ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. ఆసియాలోనే అతి పెద్దదైన 3500 మెగావాట్ల సోలార్ పార్కులను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణపట్నం, విటిపిఎస్ విస్తరణతో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. 1.4 కోట్ల ఎల్‌ఇడి బల్బులను 70 లక్షల కుటుంబాలకు అందించామన్నారు. దీనివల్ల 843 ఎంయు విద్యుత్ పొదుపుతో విద్యుత్ వినియోగదారులకు కొంతమేరకు కరెంటు బిల్లులు తగ్గుతాయన్నారు. కోటి కుటుంబాలకు రెండు కోట్ల ఎల్‌ఇడి బల్బులు అందించే మొత్తం ప్రక్రియ మరో మూడు మాసాల్లో పూర్తిచేయాలన్నారు. మొత్తంగా 5.5 లక్షల ఎల్‌ఇడి వీధి దీపాల ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ప్రతి ఇంట్లో స్టార్ రేటెడ్ విద్యుత్ గృహోపకరణాలు వాడకంలోకి తెచ్చే విధంగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. పైలెట్ ప్రాజెక్టు కింద పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సులభ వాయిదా పద్ధతిలో లక్ష ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్లను అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవిఆర్ కృష్ణారావు, సిఎంఒ కార్యదర్శి సాయి ప్రసాద్, ఇంధన పెట్టుబడులు, వౌలిక సదుపాయాల కార్యదర్శి అజయ్ జైన్, ఏపి ట్రాన్స్‌కో సిఎండి విజయానంద్, ఇంధన సలహాదారు కె.రంగనాథం, ఏపి ట్రాన్స్‌కో ఫైనాన్స్ డైరెక్టర్ దినేష్ పరుచూరి, డిస్కాంల సిఎండిలు ముత్యాలరాజు, హెచ్‌వై దొర పాల్గొన్నారు.