ఆంధ్రప్రదేశ్‌

పట్టిసం ఐదవ మోటారు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

14 మీటర్లకు తగ్గినా కొనసాగుతున్న పంపింగ్
పోలవరం, డిసెంబర్ 3: పట్టిసం ఎత్తిపోతల పథకం నుండి గురువారం ఐదవ మోటారును ఆన్‌చేసి నీటిని విడుదల చేశారు. దీనితో మొత్తం ఐదు మోటార్లద్వారా రోజుకు 1750 క్యూసెక్కుల గోదావరి నీటిని పోలవరం కుడికాల్వ ద్వారా కృష్ణా డెల్టాకు తరలిస్తున్నారు. సెప్టెంబరు 19న మొదటి మోటారును మంత్రి దేవినేని ప్రారంభించారు. అయితే జానంపేట వద్ద అక్విడెక్టుకు గండి కారణంగా 20 రోజులు మోటారు తిరగలేదు. అనంతరం మోటారును ఆన్‌చేసి కృష్ణాకు గోదావరి నీటిని తరలిస్తున్నారు. రెండు నెలల కాలంలో 5 మోటార్లను ప్రారంభించగలిగారు.
కాగా గోదావరి నీటిమట్టం 14 మీటర్లకు దిగువకు చేరుకున్నా పట్టిసం ఎత్తిపోతల పథకంలో నీటి తోడకం ఆగలేదు. నీటిమట్టం 14 మీటర్ల లెవెల్ తగ్గితే మోటార్లు ఆన్ చేయమని పథకం జీవోలో పేర్కొన్నారు. ప్రస్తుతం 14 మీటర్లు దిగువకే గోదావరి నీటిమట్టం వుంది. అయినప్పటికీ నిరంతరాయంగా గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నారు. అయితే సీలేరు ప్రాజెక్టు నుండి రోజుకు 12 వందల క్యూసెక్కుల నీరు గోదావరిలో కలుస్తుందని, ఇప్పటికీ నాలుగువేల క్యూసెక్కులకు పైగా గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. పట్టిసీమ ద్వారా ఇప్పటివరకు 3 టిఎంసిలకు పైగా నీరు కృష్ణా డెల్టాకు చేరిందని, కృష్ణా డెల్టాలో వరి పంట పొట్ట దశలో ఉండగా నీరు రావడంతో ఆ పంటకు చాలా ఉపయోగపడ్డాయని ఆ ప్రాంతం నుండి వచ్చిన రైతులు తెలిపారు. రాబోయే వేసవికి కృష్ణా, గుంటూరు జిల్లాలకు తాగునీటి అవసరాలకు కూడా ఉపయోగిస్తారని తెలిసింది. మరో పది రోజులు మాత్రమే ఈ మోటార్లు తిరిగే అవకాశముందని, ఆ తరువాత పంపింగ్ ఆపివేస్తారని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు.