అవీ .. ఇవీ..

పుర్రెకో బుద్ధి..జిహ్వకో రుచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పై సామెతకు అద్దం పట్టే ఫొటో ఇది. మానవుని తలకాయను పోలిన టేబుల్స్‌పై ఇలా టిఫిన్ చేయడం వారికి బోలెడంత ఆనందాన్నిస్తోందిట. అంటే మనిషి మెదడు తినేస్తున్నట్టన్నమాట. చైనాలోని బీజింగ్‌లో ఈ మధ్యే ప్రారంభమైన ఓ రెస్టారెంట్‌లో ఈ తరహా టేబుల్స్ ఏర్పాటు చేసి వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు.

మే డే ఇలా...
ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో ఈ మధ్యే జరిగిన మే డే వేడుకల్లో ఓ కళాకారుడు ఇలా ఆకుపచ్చ రంగు ముఖానికి పులుముకుని నగరమంతా తిరిగాడు. వేకువజామునే లేచి, తెలతెలవారుతూండగా తిరుగుతూ అందరికీ మేలుకొలుపు పలికాడు. అక్కడ మే నెల అంతా ఇలా వేడుక జరుపుకోవడం ఓ హాబీ.

ఇదోరకం ఫ్యాషన్
ప్రపంచ ప్రఖ్యాత దుస్తుల రూపకర్త మారియా ఫిలిప్పొ రూపొందించిన అధునాతన డిజైన్లతో ఫ్యాషన్ షోకు హాజరైన మోడళ్లు వీరు. జంతువుల ముఖాలను పోలిన మాస్క్‌లతో, అందుకుతగ్గ డిజైన్ల దుస్తులతో వారిలాఫోజిచ్చారు. లండన్‌లో జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఫ్యాషన్ షోలో వీరిలా కన్పించారు.

కుక్కపిల్లకూ రంగుల ముచ్చట
విశ్వాసానికి మారుపేరైన తన పెంపుడు కుక్కపిల్ల అంటే దాని యజమానురాలికి చాలా ఇష్టం. ఇదిగో...ఈ ఫొటోలో కన్పిస్తున్న ఆరేళ్ల లూయిసా అనే కుక్కపిల్లకు బొచ్చుగొరికి కాళ్లవద్ద మాత్రం కొంత ఉంచి అందంగా దానికి రంగు వేయించింది దాని యజమాని. దాదాపు వంద అమెరికన్ డాలర్ల మొత్తాన్ని అందుకోసం ఖర్చుచేసిందామె. బీజింగ్‌కు చెందిన ఫర్దియాన్‌కు అలా తరచూ రంగులు వేయించడం ఓ ముచ్చట.