జాతీయ వార్తలు

పుట్టింగల్ ఆలయంలో అగ్నిప్రమాదం...103మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం:కేరళలోని కొల్లం ప్రాంతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పుట్టింగల్ ఆలయంలో అగ్నిప్రమాదం సంభవించి భారీ ప్రాణనష్టం సంభవించింది. మీనాభరణి ఉత్సవాలలో భాగంగా ఆలయానికి తరలివచ్చిన భక్తులు బాణాసంచా కాలుస్తుండగా మంటలు అంటుకుని నలువైపులా వ్యాపించాయి. వేడుకల్లో ఉన్న భక్తులు తప్పించుకునేలోగానే వందమందికిపైగా మృత్యువాద పడ్డారు. వందల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. కాగా ఈ సంఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. కాగా మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాని మోదీ తిరువనంతపురం మీదుగా పుట్టింగల్ ఆలయానికి చేరుకుని బాధితులను పరామర్శించారు.