క్విజ్

‘పద్మవిభూషణుడు’ కాళోజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1.కాళోజీ నారాయణరావు ఏయే పోరాటాలలో పాల్గొన్నారు?

ఎ.సత్యాగ్రహ ఉద్యమం, ఆంధ్ర మహాసభ
బి.గ్రంథాలయోద్యమం, రజాకారుల వ్యతిరేకోద్యమం
సి.ఆర్య సమాజ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం వందేమాతర ఉద్యమం
డి.పైవన్నియు

2.సాహిత్య మరియు సాంఘిక రంగాలకు కాళోజీ చేసిన అమోఘమైన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ఏ అత్యున్నత పురస్కారమిచ్చి సత్కరించింది?

ఎ.జ్ఞానపీఠ్ అవార్డు బి.పద్మభూషణ్
సి.పద్మ విభూషణ్ డి.పైవన్నియు

3.1992లో సాహిత్య రంగంలో కాళోజీకి ఏ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది?

ఎ.నాగార్జున విశ్వవిద్యాలయం
బి.వెంకటేశ్వర విశ్వవిద్యాలయం
సి.ఉస్మానియా విశ్వవిద్యాలయం
డి.కాకతీయ విశ్వవిద్యాలయం

4.కాళోజీ నారాయణరావు సెప్టెంబర్ 9, 1914న జన్మించారు. ఆయన జన్మదినాన్ని తెలంగాణా ప్రభుత్వం ఏ రోజుగా ప్రకటించింది?

ఎ.తెలంగాణ కవుల రోజు
బి.తెలంగాణ ఉద్యమకారుల రోజు
సి.తెలంగాణ భాష రోజు
డి.తెలంగాణ పండితుల రోజు

5.కాళోజీ నారాయణరావు ఏ రాజకీయ పదవిని అలంకరించారు?

ఎ.ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా
బి.ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా
సి.రాజ్యసభ సభ్యుడిగా
డి.పైవన్నియు

6.పుట్టుక నీది చావు నీది, బ్రతుకంతా దేశానిది అన్న కాళోజీ చివరి కోరిక ప్రకారం ఆయన పార్థీవ దేహాన్ని ఏ వైద్య కళాశాల విద్యార్థుల పరిశోధన నిమిత్తం తరలించారు?

ఎ.నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్
బి.కింగ్ జార్జ్ హాస్పిటల్, విశాఖపట్నం
సి.కాకతీయ మెడికల్ కాలేజీ, వరంగల్
డి.కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైనె్సస్, వరంగల్

7.కాళోజీ నవంబర్ 2, 2002న పరమపదించారు. కాళోజీ నారాయణరావు పేరు మీద ప్రభుత్వం ఏ విద్యా సంస్థని స్థాపించింది?

ఎ.కాళోజీ నారాయణరావు స్కూల్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్, హైదరాబాద్
బి.కాళోజీ నారాయణరావు ఇంజనీరంగ్ కాలేజీ, ఖమ్మం
సి.కాళోజీ నారాయణరావు ఆర్ట్స్ కాలేజ్, నిజామాబాద్
డి.కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైనె్సస్, వరంగల్

8.కాళోజీ గారి అసలు పేరు లేదా పూర్తి పేరేమిటి?

ఎ.నాగ సత్య వెంకట కాళేశ్వరరావు
బి.రఘురామ కాళేశ్వర నారాయణరావు
సి.లక్ష్మీకాంత్ శ్రీనివాస కాళికా నారాయణరావు
డి.రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాస రామ్ రాజ కాళోజీ
*
గత వారం క్విజ్ సమాధానాలు
*
1.డి 2.ఎ 3.సి 4.డి 5.సి 6.డి 7.డి 8.సి 9.సి 10.డి

-సునీల్ ధవళ 97417 47700