ఫిలిం క్విజ్

ఫిలింక్విజ్ 28

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2. శివాజీరాజా హీరోగా చిత్రం/ నాజర్ హీరోగా ఓ చిత్రం -పేరు?
3. నాకూ ఓ లవరుంది/ వినాయకుడు -హీరో పేరు?
4. అనగనగా ఓ ధీరుడు/ గబ్బర్‌సింగ్ -నాయిక?
5. శారదకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు/ ఓ తెలుగు చిత్రం -పేరు?
6. ఏరా మనతోటి గెలిచే వీరుడెవ్వడురా?/ బొమ్మలమ్మా బొమ్మలు -పాటలున్న చిత్రం?
7. ఓ నాయిక జమున/ మరో నాయిక జయండి.. -జెమినీవారి చిత్రం పేరు?
8. చంద్రహారం/ పెంకి పెళ్లాం -దర్శకుడు?
9. నిండు మనసులు/ భీమవిజయం -జంట?
10. పక్క చిత్రంలోని నటి ఎవరు?