మహబూబ్‌నగర్

రోహిత్ ఆత్మహత్యపై సమగ్రమైన విచారణ జరపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 22: సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై సమగ్రమైన విచారణ జరపాలని, బిజెపి నేతలపై బురద జల్లే కార్యక్రమానికి కాంగ్రెస్, వామపక్షాల పార్టీలు తెరలేపావని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. ఆచారి అన్నారు. శుక్రవారం సాయంత్రం బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆచారి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ శవ రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. రోహిత్ ఆత్మహత్య బాధ కలిగించిందని ఈ విషయాన్ని బిజెపి కూడా బహిరంగంగా చెప్పడం జరిగిందన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న విషయాలను కేంద్ర మంత్రిగా దత్తాత్రేయ సంబంధిత కేంద్ర మంత్రికి లేఖ రాయడం తప్పేమికాదన్నారు. లేఖలో రోహిత్ పేరుగానీ, మరె ఇతర అంశాలు గానీ లేవన్న విషయాన్ని విపక్షాలు గుర్తించుకోవాలని హితవు పలికారు. మహనుబావుడు అంబేద్కర్ భావజాలాన్ని, ఆయన సిద్దాంతాన్ని వక్రీకరిస్తూ కొన్ని సంస్థలు విద్యార్థులను ప్రేరేపిస్తూన్నాయని సుప్రీంకోర్టు, రాష్టప్రతి తీర్పులను కూడా తప్పుబట్టే రితీలో కొన్ని సంస్థలు సెంట్రల్ యూనివర్సిటీలో కార్యక్రమాలు నిర్వహించడమంటే అది దేశద్రోహమేనని అన్నారు. ఆసలు రోహిత్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో సమగ్రమైన విచారణ జరపాల్సిన అవసర ఉందని అందుకు బిజెపి డిమాండ్ కూడా చేస్తుందన్నారు. యూనివర్సిటీలలో, విద్యాలయాల్లో వామపక్ష బావజాలం గల కొందరు ప్రొఫెసర్లు, సంఘాల నాయకులు విద్యార్థులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. విద్యాలయాల్లో దేశభక్తి, జాతీయ భావంతో కూడిన కార్యక్రమాలు నిర్వహించాలని ఉగ్రవాదులకు అనుకూలంగా కార్యక్రమాలు నిర్వహించడమంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లేనని అన్నారు. లెప్టు పార్టీలు రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేశాయని అదేవిధంగా ఇందులో కాంగ్రెస్ కూడా శవరాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఆగమేఘాల మీద ఎలాంటి విచారణ లేకుండా కేంద్ర మంత్రి దత్తాత్రేయపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం వెనుక ప్రభుత్వం హస్తం ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే స్పందించని కెసిఆర్ కూతురు కవిత రోహిత్ ఆత్మహత్యపై రాధాంతం చేయడం ఏమీటని ప్రశ్నించారు. ఆందోళన చేస్తున్న వారు ఓ సారి ఆత్మ విమర్శన చేసుకోవాలని ప్రతి ఒక్కరు రోహిత్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరపాలని ఎందుకు డిమాండ్ చేయడం లేదన్నారు. రోహిత్ ఆత్మహత్య లేఖలోనే తన మృతికి ఎవరు కారకులు కారని రాశారని ఈ విషయంపై ఎందుకు చర్చించడం లేదన్నారు. ప్రతి విషయంపై ప్రధాన మంత్రిపై బురద జల్లే కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టిందని తెలంగాణ ఉద్యమంలో 1100 మంది యువకులు ఆత్మబలిదానాలు చేసుకుంటే పరామర్శించని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు శవ రాజకీయలు చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్ ఎదురుగా తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డి తన లేఖలో సోనియాగాంధీ, జైపాల్ రెడ్డిలే తన మృతికి కారణమని లేఖ రాశారని అప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు స్పందించలేదని యాదిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి మనసు రాలేదా అని ఆరోపించారు. శనివారం బిజెపి కూడా ప్రజల ముందుకు వెళ్లడానికి మహబూబ్‌నగర్‌లో ర్యాలీ నిర్వహించి ఆసలు విషయాలు బయటపెడతామని ఆచారి తెలిపారు. బలహీన వర్గాలకు చెందిన ప్రధాన మంత్రిని కాంగ్రెస్ టార్గెట్ చేయడం తగదని హితవు పలికారు. ఈ విలేఖరుల సమావేశంలో బిజెపి మహిళ మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు పద్మజారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండు రెడ్డి, ప్రధాన కార్యదర్శి బాలరాజు, నాయకులు రాంచంద్రయ్య, శ్రీనివాసులు, వీరబ్రహ్మచారి, అంజమ్మ, రామేశ్వరమ్మ, దళిత మోర్చ నాయకులు తదితరులు పాల్గొన్నారు