ఓ చిన్నమాట!

గోల్డ్ మెడల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను మూడు డిగ్రీలు తీసుకున్నప్పటికీ ఎప్పుడూ స్నాతకోత్సవ సభలో పాల్గొనలేదు. మా అబ్బాయి గ్రాడ్యుయేషన్ ఫంక్షన్‌కి అమెరికా వెళ్లాలని అనుకున్నాను. కానీ కోర్టులో పని ఒత్తిడి వల్ల వెళ్లలేక పోయాను. మా అమ్మాయి స్నాతకోత్సవ సభలో కూడా పాల్గొనలేక పోయాను.
అలాంటి నాకు చిక్కడపల్లిలోకి ఓ కాలేజీ వాళ్లు స్నాతకోత్సవ సభకి ముఖ్య అతిథిగా పిలిచారు. అనుకున్న సమయానికి ఓ అరగంట ముందుగా కాలేజీకి రమ్మంటే వెళ్లాను. స్నాతకోత్సవ గౌనుని ఇచ్చారు. ఆ తరువాత ఆ కాలేజీ అద్యాపకులతో పాటూ రెండు ఫొటోలు దిగిన తరువాత కార్యక్రమ వివరాలని అందించారు.
ఆ కాలేజీలో దాదాపు 800 మంది విద్యార్థులు చదువుతున్నారు. కానీ గోల్డ్‌మెడల్స్ వచ్చిన వ్యక్తులు పదిమంది ఉన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనపరచిన విద్యార్థులు అంతా కలిపి ఓ యాభైకి మించరు.
ఏం మాట్లాడాలో తోచలేదు. ఆ యాభై మంది అందరికీ ఆకర్షణగా నిలుస్తారు. మిగతా 750 మంది ఆకర్షణగా నిలవరు. ఈ విషయమే నా మనస్సులో తిరిగింది. నాకు ఎప్పుడూ గోల్డ్ మెడల్స్ రాలేదు. గోల్డ్ మెడల్స్ వచ్చిన వాళ్లు జీవితంలో అనుకున్నంత పైకి రాలేరు. అందరినీ ఉత్తేజపరిచే విధంగా మాట్లాడాలని అప్పుడు నాకన్పించింది. అదే పని చేశాను.
గోల్డ్‌మెడల్ పొందిన విద్యార్థులని, పొందని విద్యార్థులను అభినందించాను. చాలా విషయాలు మాట్లాడి చివరికి నా విషయం చెప్పాను.
‘నేను ఎప్పుడూ స్నాతకోత్సవంలో పాల్గొనలేదు. నాకు ఎప్పుడూ గోల్డ్ మెడల్స్ రాలేదు. కానీ జీవితంలో చాలా ప్రయాణం చేశాను. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశాను. ఆ తరువాత న్యాయమూర్తి పదవిలోకి వెళ్లిపోయాను. ఆ తరువాత రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యునిగా నియమించబడ్డాను. గోల్డ్ మెడల్స్ వచ్చిన వాళ్లకు అభినందనలు. రాని వాళ్లు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. జీవిత ప్రయాణంలో పరుగెత్తడం ముఖ్యం. ఆ పరుగులో మనం అనుకున్న గమ్యానికన్నా ముందుకు వెళ్లే అవకాశం వుంటుంది.’
ఇలా కొనసాగింది నా ఉపన్యాసం. పిల్లలకి లెక్చరర్లకి నా ఉపన్యాసం చాలా నచ్చింది. నచ్చిందని చెప్పేకన్నా ఎక్కువ ఉత్తేజాన్ని ఇచ్చిందని ఆ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ చంద్రకళ ఆ తరువాత చెప్పారు.
ఆ కార్యక్రమంలో పాల్గొన్న మరో అతిథి ఐ.ఎఫ్.ఎస్. అధికారి రామలక్ష్మి గారికి నా ఉపన్యాసం బాగా నచ్చింది. అంత ఓపెన్‌గా నేను మాట్లాడటం ఆవిడకి ఆశ్చర్యాన్ని కలిగించింది.
గోల్డ్ మెడల్ ముఖ్యమే. జీవితంలో గోల్ చేరుకోవడం అంతకన్నా ముఖ్యం.

- జింబో 94404 83001