రివ్యూ

వినాయక్ విఫలయత్నం! * ఇంటిలిజెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం:
సాయధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి,
ఆశిష్ విద్యార్థి, నాజర్, పోసాని,
షాయాజీషిండే, బ్రహ్మానందం,
రాహుల్‌దేవ్, దేవ్‌గిల్, ఆకుల శివ,
జయప్రకాష్‌రెడ్డి, విద్యుల్లేఖా రామన్
కెమెరా: ఎస్వీ ఈశ్వర్
సంగీతం: ఎస్.ఎస్ థమన్
నిర్మాణం: సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత: సి.కళ్యాణ్
దర్శకత్వం: వి.వి. వినాయక్

మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌లను తెరకెక్కించడంలోనూ, హీరోలకు మాస్ ఇమేజ్‌ను ఆపాదించడంలోనూ దర్శకుడు వి.వి.వినాయక్‌కు సిద్ధహస్తులు. ఆయనతో కెరీర్‌లో ఒక్క సినిమా అయినా చేయాలని, దానితో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకోవాలని చాలా మంది హీరోలు కోరుకుంటారు. అలాంటి దర్శకుడు తాజాగా సాయిధరమ్ తేజ హీరోగా ‘ఇంటిలిజెంట్’ అనే సినిమాను రూపొందించారు. లావణ్య త్రిపాఠి కథానాయిక. సి.కళ్యాణ్ నిర్మాత. కెరీర్ ప్రారంభంలో ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘సుప్రీమ్’ చిత్రాలతో వరుస విజయాలను దక్కించుకున్న హీరో సాయిధరమ్ తేజ్. అయితే ఈ సుప్రీమ్ హీరో నటించిన గత నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా చతికిలపడి అతడి కెరీర్‌ను తుంగలో తొక్కేశాయి. మరి ఇలాంటి తరుణంలో కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా పేరున్న వి.వి.వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ సినిమా చేయడంతో మంచి అంచనాలే నెలకొన్నాయి. హీరో సాయిధరమ్‌లో హిట్ కోసం ఆశలు చిగురించాయి. మరి ఈ సినిమాతో అతడి ఆశలు నెరవేరాయా? సక్సెస్ అయ్యాడా? చిరంజీవి కమ్ బ్యాక్ సినిమాకు దర్శకత్వం వహించిన వినాయక్ సాయిధరమ్‌ను తెరపై ఎలా ఆవిష్కరించాడు? అన్నది తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
అనాథలకు, పేద వాళ్లకు సహాయపడే విజన్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ అధినేత నందకిషోర్ (నాజర్). తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులను ఎంతో ప్రేమగా చూసుకుంటుంటాడు. నందకిషోర్ సహాయంతో చదువుకుని.. అదే కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదిస్తాడు తేజ (సాయిధరమ్ తేజ). అతడి స్నేహితులు (రాహుల్, రామకృష్ణ, సప్తగిరి, నల్లవేణు)తో కలిసి నచ్చిన చోట ఇష్టమైన ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. అలాంటి తేజ జీవితంలోకి ఓ అమ్మాయి (లావణ్య త్రిపాఠి) ఎంటరవుతుంది. ముం దు తేజ అంటే అయిష్టం వ్యక్తం చేసినా.. అమ్మాయిలంటే అతనికున్న గౌరవాన్ని చూసి తేజని ఇష్టపడుతుంది. ఈ నేపథ్యంలోనందకిషోర్‌ను దెబ్బకొట్టిఎలాగైనా అతడి కంపెనీని సొంతం చేసుకోవాలనుకుంటారు ప్రత్యర్థి వర్గం. అందులో భాగంగా మాఫియా డాన్ విక్కీ భాయ్ (రాహుల్ దేవ్), అతడి తమ్ముడు (దేవ్‌గిల్)ల సహాయం తీసుకుంటారు. విక్కీ అండ్ గ్యాంగ్ నందకిషోర్‌ను బెదిరించినా లొంగడు. ఢిల్లీకి వెళ్లి సెంట్రల్ మినిష్టర్‌ను కలవాలనుకుంటాడు. అయితే అనుకోకుండా తన కంపెనీ విజన్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్‌ను విక్కీకి రాసేసి ఆత్మహత్య చేసుకుంటాడు నందకిషోర్. అదే సమయంలో తేజపై దాడి కూడా జరుగుతుంది. అసలు నందకిషోర్ ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? అదిహత్యా? ఆత్మహత్యా? చివరకు తనకు అండగా నిలబడ్డ నందకిషోర్ అండ్ ఫ్యామిలీ కోసం తేజ ఎలాంటి సాహసం చేస్తాడు? సమస్యల్లో చిక్కుకుపోయిన కంపెనీని కాపాడటానికి రంగంలోకి దిగిన ధర్మాభాయ్ ఎవరు? అనేదే సినిమా.
నిజానికి సినిమాలో కొత్తగా ఏమీలేదు. చెత్తకథ. సాఫ్ట్‌వేర్ కంపెనీని దక్కించుకోవాలని చూసే మాఫి యా డాన్, అతడిని అంతం చేసి కంపెనీని కాపాడడం కోసం హీరో చేసే ఫీట్లు.. ఇవి ఎన్ని సినిమాల్లో చూడలేదు? గతంలో సాయిధరమ్ ఫక్తు కమర్షియల్ చిత్రాల్లోనే నటించినప్పటికీ కాస్తో కూస్తో మంచి కథలనే ఎన్నుకున్నాడు. కానీ ఇక్కడ దర్శకుడు వినాయక్ కావడంతో కనీసం కథ కూడా వినకుండా సినిమా చేశాడా? అనే సందేహం కలుగుతుంది. కథ ఎలాగూ లేదు. పోనీ కథనాన్నయినా బాగా నడిపించాడా? అంటే అదీ లేదు. ఈ విషయంలో దర్శకుడు వి.వి.వినాయక్ ఘోరమైన టేకింగ్‌తో పూర్తిగా విఫలమయ్యాడు. రొటీన్ సన్నివేశాలను సాగదీసి చూపిం చి ప్రేక్షకులను బాగా విసిగించాడు. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ అస్సలు వర్కవుట్ కాలేదు. కామెడీ, రొమాన్స్ ఏ ఒక్క అంశం ఆకట్టుకోకపోగా, థియేటర్ నుంచి ఎప్పుడు బయటపడదామా? అనిపించింది. అంత కంగాళీగా వుంది. ఈ ఇంటిలిజెంట్ వినాయక్ విఫలయత్నమే! లావణ్య త్రిపాఠి క్యారెక్టర్ కేవలం పాటలకే పరిమితం చేశారు. ఈ పాత్రను ఎందుకు పోషించిందో ఆమెకే తెలియాలి. మెగాస్టార్ ‘చమక్ చమక్ చామ్’ పాటను ఎందుకు రీమిక్స్ చేశారో అస్సలు అర్థం కాదు. ఆ పాట స్థాయిని తగించారనిపిస్తుంది. నటుడిగా సాయిధరమ్ తేజ్ ఆకట్టుకున్నా ఫలితం లేదు. విలన్ పాత్రలన్నీ హాస్యాస్పదంగా అనిపించాయ. పోసాని, కాశీ విశ్వనాథ్, నాజర్, బ్రహ్మానందం, షాయాజీషిండే, జయప్రకాష్, తేజ, సప్తగిరి, విద్యుల్లేఖారామన్, ఫిష్ వెంకట్ తదితరులు ఉన్నంతలో తమ పాత్రలకు న్యాయం చేశారు. ఆకుల శివ అందించిన కథలో కొత్తదనమేంటో దర్శకుడు వినాయక్‌కే తెలియాలి. థమన్ పాటలు వినసొంపుగా లేనేలేవు. నిర్మాణ విలువలు బాగానే వున్నాయి. అయితే లాభం ఏంటీ? దర్శకుడు వి.వి.వినాయక్ కెరీర్‌లో ఇంత బలహీనమైన చిత్రం మరొకటి లేదు. మొత్తం మీద ఇది అన్ ఇంటిలిజెంట్ కథ!

-ఉషశ్రీ తాల్క