నేర్చుకుందాం

నరసింహ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ॥ హరి! నీకు పర్యంకమైన శేషుఁడు చాలఁ
బవనము భక్షించి బ్రతుకుచుండు
ననువుగా నీకు వాహనమైన ఖగరాజు
గొప్పపామును నోటఁగొఱుకుచుండు
నదిగాక నీ భార్యయైన లక్ష్మీదేవి
దినము పేరంటంబు దిరుగుచుండు
నిన్ను భక్తులు పిల్చి నిత్య పూజలు చేసి
ప్రేమఁ బక్వాన్నముల్ బెట్టు చుండ్రు

తే॥ స్వస్థముగ నీకు గ్రాసము జరుగుచుండ
గాసు నీచేతి దొకటైనఁ గాదు వ్యయము
భూషణ వికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: స్వామీ! నీ వాహకుడైన ఆదిశేషుడు గాలిని మేస్తాడు. నిన్ను మోసే గరుత్మంతుడు పామును భక్షిస్తాడు. నీ యిల్లాలు శ్రీదేవి నిత్యం పేరంటాలకు ఇల్లిల్లు తిరుగుతుంది. నిన్ను పిల్చి భక్తులు సదా పూజిస్తారు. నైవేద్యాలు సమర్పిస్తారు. నీకు సుఖంగా జీవితం సాగుతోంది. ఒక్క పైసైనా ఖర్చుకాదు.