Others

పెంజీకటికావల ఉన్న వెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనిరుద్ధ
16.దేవకీ సుతు పౌత్రుడు దివ్యతేజు
డమిత సుందరు డనిరుద్ధు డసుర కన్య
బాణు పుత్రికకై నాగపాశ బద్దు
డైన మనుమని విడిపించి బాణునొంచి
పెండ్లిజేసెను కంసారి ప్రేమికులకు

పురుషోత్తమ
17.చేతనములుందు నీలోన చతనముల
యందు జీవాత్మవై వెల్గుచుందు వీశ
పుణ్యపురుషులు పురుషోత్తమా యటంచు
నన్యమెరుగక ధ్యానింత్రు నినె్న వరద

అధోక్షజ
18.అచలు డవ్యక్తు డాది మధ్యాంత రహితు
డక్షరుండీత డలము దధోక్షజుండు
భక్త జన వత్సలుందురు పాప తిమిర
భాస్కరుం డంబుజాలయ పతియె యితడు

నరసింహ
19.కంబమందున నీహరి గలడె యనుచు
హేమ కశిపుడు తనయుని హుంకరించి
పలుక నారసింహ మూర్తివై భక్తరక్ష
కొరకు నిహితుని జేయనే కనక కశిపు

అచ్యుత
20.అచ్యుతా పరమేశ్వరా చింత్యరూప
లోకములు రూపుమాసి పెంజీకటైన
అద్వితీయుడవై వెల్గు దమర వంద్య
అఖిల మెల్లను నీయందె నెగడు దేవ

కేశవ చతుర్వింశతి

టంగుటూరి మహాలక్ష్మి