రాష్ట్రీయం

రోహిత్ ఆత్మహత్యపై కేంద్రం అవాస్తవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: వర్శిటీ రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్యపై కేంద్రం అవాస్తవాలు చెబుతోందని జెడియు పార్లమెంట్ సభ్యులు త్యాగి, పవన్‌కుమార్ ఆరోపించారు. శుక్రవారం వర్శిటీ ప్రాంగణంలో విద్యార్థులు చేపట్టిన నిరాహార దీక్ష శిబిరాన్ని వారు సందర్శించారు. విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపి త్యాగి మాట్లాడుతూ కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలను వెంటనే మంత్రి పదవుల నుంచి బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. రోహిత్ కుటుంబాన్ని వర్శిటీ యాజమాన్యం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. హైదరాబాద్ సెంల్ యూనివర్శిటీకి దేశవ్యాప్తంగా మంచి పేరు ఉందని, అలాంటి వర్శిటీలో గత పదేళ్లుగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం శోచనీయమన్నారు. వర్శిటీ పాలకుల నిర్లక్ష్యం, కుల వివక్ష స్పష్టంగా కనిపిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్‌సియూలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు త్రిపుర సిఎం మాణిక్ సర్కార్ సంఘీభావం తెలిపారు. శుక్రవారం కరీంనగర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన హెచ్‌సియూకి వచ్చారు. నిరాహార దీక్షలో పాల్గొన్న విద్యార్థులను పలకరించారు. రోహిత్ స్మారక స్థూపానికి నివాళులర్పించారు. సమయాభావంవల్ల మాట్లాడలేక పోతున్నానంటూ వెళ్లిపోయారు.