జాతీయ వార్తలు

రైతుల పట్ల జాలిచూపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహోబా (ఉత్తరప్రదేశ్), జనవరి 23: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కరవు పీడిత ప్రాంతమైన బుందేల్‌ఖండ్‌లో శనివారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మోదీ కేవలం పారిశ్రామికవేత్తల గురించే కాకుండా రైతులు, కార్మికు గురించి కూడా ఆలోచించాలని, వెనుకబడిన ప్రాంతాలకు మరిన్ని నిధులిచ్చి ఆదుకోవాలని రాహుల్ హితవు పలికారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో కొద్దిరోజుల క్రితం వేముల రోహిత్ అనే దళిత విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంపై ప్రధాని శుక్రవారం ఆవేదన వ్యక్తం చేయడాన్ని రాహుల్ ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, మోదీకి అన్నం పెడుతున్న అన్నదాతలపై కూడా ఆయన జాలి చూపాలన్నారు. దాదాపు 7 కిలోమీటర్ల దూరం పాదయాత్ర నిర్వహించిన రాహుల్ అనంతరం అక్కడి గ్రామస్తులను ఉద్ధేశించి ప్రసంగించారు. చమురు ధరలు తగ్గడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆదా చేసిన సొమ్మును బుందేల్‌ఖండ్ ప్రాంతానికి మళ్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘బిబిఎయు స్నాతకోత్సవంలో శుక్రవారం మోదీ భావోద్వేగంతో ప్రసంగిస్తూ మొసలి కన్నీరు కార్చారు. మోదీ కేవలం పారిశ్రామికవేత్తల గురించే కాకుండా ఆయనకు అన్నం పెడుతున్న రైతులు, కార్మికులు, పేదల గురించి కూడా ఆలోచించాలని నేను చెప్పదలుచుకున్నా’ అని రాహుల్ అన్నారు. క్షామంతో అల్లాడుతున్న బుందేల్‌ఖండ్ ప్రాంతానికి మరిన్ని నిధులు అందజేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘యుపిఎ ప్రభుత్వ హయాంలో 150 డాలర్లుగా ఉన్న బ్యారెల్ ముడి చమురు ధర ప్రస్తుతం గణనీయంగా 28 డాలర్లకు తగ్గడంతో ఎంతో సొమ్ము ఆదా అయింది. ఈ సొమ్మును బుందేల్‌ఖండ్ లాంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగించాలి’ అని రాహుల్ అన్నారు.