హైదరాబాద్

రాష్ట్ర అధికారులపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జనవరి 23: తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ, జీహెచ్‌ఎంసి కమిషనర్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు జనం కోసం సంస్థ ప్రతినిధులు తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంస్థ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ నగరంలోని రాజేందర్ రెడ్డి నగర్ కాలనీ పార్కుల రక్షించే విషయంలో విఫలమైనందుకు ఈనెల 22న తమ ముందు హాజరు కావాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ రాజీవ్ శర్మ, జిహెచ్‌ఎంసి కమిషనర్లను ఆదేశించిందని చెప్పారు. కాగా సదరు అధికారులుబ్యునల్ ముందు హాజరు కాలేదని, ఈ కేసును విచారించిన గ్రీన్ ట్రిబ్యునల్ ఈనెల 27న తప్పని సరిగా హాజరై వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించినట్టు చెప్పారు. రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్న పట్నం మహేందర్ రెడ్డి అక్కడ కబ్జాలు చేస్తున్న వారికి అండగా ఉండటం వల్లనే అధికారులు చర్యలు తీసుకోలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్ బెల్ట్‌గా తీర్చిదిద్దుతానని హామీలు ఇస్తున్న కేసిఆర్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.