సబ్ ఫీచర్

రోహిత్ మరణంలో ఎన్నో కోణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నెలకొన్న అశాంతి, ఫలితంగా పిహెచ్‌డి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య సమాజానికి ఒక విస్తృత సందేశాలను ఇస్తున్నాయి. ఇప్పటి వరకు తలకెత్తుకున్న.. కాలంచెల్లిన, అప్రస్తుత కులవ్యవస్థలో నయా- బ్రాహ్మ ణ2 వర్గ ఆవిర్భావం అనేది మొదటి సందేశం. నాటి కాలపు బ్రాహ్మణుల నైతిక ఆధిపత్య స్థాయ, వీరికి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా, ఏం చేసినా దైవదూషణతో సమానంగా పరిగణించడమేకాదు, ఈ వర్గ ఆగ్రహానికి గురైన వారిని రాజులు శిక్షించిన రోజులు కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పుడు దళితులు, బ్రాహ్మణుల స్థానాన్ని ఆక్రమించారు.
ఏ కులంవారైనా కావచ్చు.. హత్య, ఆత్మహత్య వంటి వాటివల్ల మరణం వాటిల్లడం నిజంగా ఖండనార్హమే. ఆత్మహత్య చేసుకున్న రోహిత్ దళితుడు కాకుండా అగ్రవర్ణానికి చెందినవాడైతే ఇంతటి రగడ జరిగేదా? అనేది ప్రధానమైన ప్రశ్న. ఎట్టిపరిస్థితుల్లో జరగదు! ఒక ప్రత్యేక వర్గానికి చెందిన నాయకులకోసమే ఎందుకింద రభస జరుగుతున్నదనేదాన్ని పైకోణంలోనే అర్థం చేసుకోవాలి. వర్తమాన రాజకీయాల్లో నెలకొన్న వాస్తవమిది.
ఇక రెండవది దళితులు 3అంటరానివారు2 అనేదానికి రెండో కోణం. నాకు తెలిసిన ఒక సీనియర్ ఫ్యాకల్టీ సభ్యుడు ఒకాయన ఉన్నాడు. ఒకసారి ఆయన మాట్లాడుతూ, 34‘‘దళిత విద్యార్థులతో వ్యవహరించే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ వారు ఇతర వర్గాలవారితో ఎంత స్వేచ్ఛగానైనా వ్యవహరించగలరు. ఎందుకంటే ప్రతి ఒక్కరిపై ఎస్సీ/ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం అనే కత్తి వేలాడుతుంటుంది. ఫ్యాకల్టీ ఈ విషయంలో తగిన జాగ్రత్తలో ఉంటుంది,’’22 అన్నారు. ప్రముఖ రాజకీయ నాయకుడు బండారు దత్తాత్రేయ ఇందుకు సాక్ష్యం. మరి ఆయన చేసిన పాపమేంటి? హెచ్‌సియు క్యాంపస్‌లో చోటు చేసుకుంటున్న అరాచకాన్ని హెచ్‌ఆర్‌డి మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లడం. ఇక టీవీ యాంకర్లు, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు దత్తాత్రేయ లేఖ రాయడం కేవలం విశ్వవిద్యాలయ పాలనా వ్యవసారాల్లో కలుగజేసుకోవడం కాదా?22అంటూ గొంతులు చించుకుంటున్నారు. హెచ్‌సియూ తన నియోజకవర్గమైన సికింద్రాబాద్ పరిధిలోకి రావడం వల్ల దత్తాత్రేయ ఎంపి హోదాలో ఆ లేఖ రాసి ఉండవచ్చు. ఒక ఎంపి తన నియోజకవర్గ పరిధిలోకి వచ్చే సంస్థలో నిషిద్ధ కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నప్పుడు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లకుండా ఎట్లా ఉంటాడు? తగిన చర్యలు తీసుకోవాలని ఇక్కడ దత్తాత్రేయ మంత్రిని కోరలేదు. కాకపోతే ‘‘మీ గతిశీలక నాయకత్వంలో, విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో పరిస్థితుల్లో మంచి మార్పు వస్తుందని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు. తాను చేసిన ఈ పరోక్ష సూచనపై ఈ 3నయా-బ్రాహ్మణ2 వర్గం సృష్టించిన నానా బీభత్సానికి, ఆ మంత్రివర్యులు తగిన మూల్యం చెల్లించక తప్పదు మరి!
కార్యాకారణ సంబంధ సిద్ధాంతానికి వచ్చేసరికి, సైద్ధాంతికతను పట్టించుకోనవసరం లేదనేది మూడో సందేశం. ఇదే క్యాంపస్‌లో ఏడుగురు దళితులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు హెచ్‌ఆర్‌డీ మంత్రికి లేఖ రాస్తే ఎవరూ ఆయన్ను 3దళిత-వ్యతిరేకిగా ముద్ర వేయలేదు. మరి హనుమంతరావు, దత్తాత్రేయలు ఇద్దరూ వెనుకబడిన తరగతులకు చెందినవారే. కాకపోతే వీరు వేర్వేరు రాజకీయ సిద్ధాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరటువంటప్పుడు, హనుమంతరావును వదిలేసి కేవలం దత్తాత్రేయనే లక్ష్యంగా తీసుకొని నానా రభస చేయడం ఎందుకు? కేవలం 3సైద్ధాంతిక భిన్నత్వమే ప్రతిస్పందనల్లో తేడాకు కారణం!
భాజపాను హిందూత్వానికి అనుకూలంగా పరిగణిస్తారు. అదే యుపిఎ హిందూ వ్యతిరేకి కాకపోయినా, ఎట్టిపరిస్థితుల్లో హిందూ అనుకూలం మాత్రం కాదు. పై ప్రతిస్పందనల్లో తేడాకు కారణం కేవలం ఈ దృక్కోణమే. అందువల్ల హిందూ వ్యతిరేక2 పార్టీలన్నీ ఒకే ఛత్రం కిందికి రావాలన్నది నాలుగో సందేశం. అన్ని రాజకీయ పార్టీలు, ఇద్దరు ముఖ్యమంత్రులు హెచ్‌సియు క్యాంపస్‌కు క్యూలు కట్టడం దీన్ని స్పష్టం చేస్తున్నది. ప్రస్తుతం అధికారంలో ఉన్న పాలకవర్గం ఈ విషయంలో మరింత జాగరూకతతో ఉండాలి.
ఇక ఐదో సందేశం..దేశంలోని అనేక విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లలో దళిత ఆచరణతత్వం బాగా విస్తరించిందనేది. అది మద్రాసు ఐఐటి, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ లేదా జామియా మిలియా..ఏవైనా కావచ్చు. దళిత విద్యార్థుల లేదా ఆ వర్గానికి చెందిన వారి సంక్షేమానికి ఈ 3ఆచరణ తత్వం2 కృషి చేస్తుంటే అప్పుడది పరిపూర్ణ చట్టబద్ధమైన కార్యకలాపంగా రూపొందేది. ప్రతి ఒక్కరూ దాన్ని తప్పక ప్రశంసించేవారు. దురదృష్టవశాత్తు అంబేద్కర్ ముసుగులో చేపడతున్న కార్యకలాపాలు, దేశహితానికి అనుకూలమని భావించడానికి వీల్లేకుండా ఉంటున్నాయి.
హెచ్‌సియులో చోటు చేసుకున్న పరిణామాలకు ప్రధాన కారణం, అంబేద్కర్ విద్యార్థి సంఘం వారు 3జిహాదిస్టులకు2 మద్దతు పలకడం. ఉరిశిక్ష అమలైన అఫ్జల్‌గురు, యాకుబ్ మెమెన్‌లకు శ్రద్ధాంజలి ఘటించడం. మెమెన్ రెండువందల మంది అమాయకుల మరణానికి కారమైన ముంబయి పేలుళ్లకు బాధ్యుడు. అతని మరణం తర్వాత హెచ్‌సియు క్యాంపస్‌లో 3ఒక్క మెమెన్ మరణిస్తే, వందలమంది మెమెన్‌లు జన్మిస్తారు22 అనే నినాదాలు మారుమ్రోగాయి. పైగా వీరి ఆత్మశాంతికి2 ప్రార్థనలు నిర్వహిండం మరో ఘోరం. ఎప్పుడైతే ఈ కార్యకలాపాలు తమకు ఇబ్బంది కలిగిస్తున్నాయని గ్రహించారో వెంటనే మాట మార్చి4కేవలం ఉరిశిక్షకు వ్యతిరేకంగా2 మాత్రమే ప్రదర్శనలు నిర్వహించామంటూ కొత్త పల్లవి అందుకున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు 72 మంది ముస్లింలు, 1342 మంది హిందువులు ఉరిశిక్షకు గురయ్యారు. మరి ఈ విద్యార్థులు మొత్తం మరణశిక్షలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిపారా అన్నది ఎవ్వరికీ తెలియదు.
యాకూబ్ మెమెన్ ఉరిశిక్షను నిరసిస్తూ యూనివర్సిటీ క్యాంపస్‌లో చేసిన ప్రదర్శనలు ఎబిపివి కార్యకర్తలను రెచ్చగొట్టడం, క్యాంపస్‌లో హింసాత్మక సంఘటనలకు ప్రధాన కారణం. ఈ హింస సస్పెన్షన్లకూ దారితీసింది. ఇది న్యాయమా? కాదా? అన్నది జ్యుడిషియల్ కమిషన్ నిర్ధారిస్తుంది. ఈ హెచ్‌సియు ఎపిసోడ్‌పై జాతీయ మీడియా వ్యవహరించిన తీరు మాత్రం భయానకం. ఈ ఉదంతానికి సంబంధించి ప్రింట్ మీడియా పేజీలకు పేజీలు కేటాయిస్తే, ఎలక్ట్రానిక్ మీడియా గంటలకొద్దీ సమయాన్ని వెచ్చించింది. అసలు ఎవరూ సమస్యకు రెండో కోణాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. అంతా 3వన్‌వే ట్రాఫిక్2 మాత్రమే! అంబేద్కర్ యూనియన్ విద్యార్థులు నిజంగా క్యాంపస్‌లో యాకుబ్ మెమెన్‌కు శ్రద్ధాంజలి ఘటించారా? అతనికి అనుకూలంగా పోస్టర్ల ప్రచారం నడిపారా? అన్న అంశంపై ఏ జర్నలిస్టు పరిశోధన జరపడానికి యత్నించలేదు! ప్రతిపక్ష పార్టీల వారు తమ అసందర్భ ప్రేలాపనలతో సమస్యకు మరింత రాజకీయ రంగు పులమడానికి యత్నిస్తూ, రాబందుల మాదిరిగా వ్యవహరించారు. ఇక అధికారపార్టీకూడా సమస్యను పరిష్కరించడంలో సమర్ధవంతంగా వ్యవహరించలేదనేది స్పష్టమైంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ రగులుతున్న నిప్పుకు తనవంతు ఆజ్యం పోశారు. చివరకు ప్రధాని రోహిత్ మృతిపై స్పందించినా, అందుకు ప్రతిపక్షాల స్పందన అత్యంత దారుణం. మోదీ దళితుల పట్ల హేళనగా వ్యవహరిస్తున్నారంటూ నిందలు!
రోహిత్ మంచి తెలివికలవాడు, ఉజ్వల భవిష్యత్తు ఉన్న స్కాలర్. కానీ జాతీయ చిహ్నాలుగా ఉన్న ప్రముఖ వ్యక్తులపై అతడు వ్యక్తం చేసిన అభిప్రాయం వెనుక అసలు ఉద్దేశం తెలుసు కోవాలి. జనవరి 8న స్వామి వివేకానందపై అతను ఈవిధంగా ట్వీట్ చేశాడు: ‘‘ వివేకానందుడు కుల వ్యవస్థ సమర్ధకుడు. మహిళా ద్వేషి. కుహనా మేధావి. సగం-పిచ్చివాడు, వ్యర్థ ప్రేలాపనలు తప్ప శాస్త్ర ప్రమాణికత లేనివాడు. ఆయన వద్ద జ్ఞానానికి సంబంధించిన నిజమైన ఆలోచనలు లేవు. అటువంటి వ్యక్తి జయంతి ఉత్సవాలను హెచ్‌సియులో సంస్థాపరంగా నిర్వహించడంపై నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తున్నది, నిరుత్సాహం కూడా కలుగుతోంది.’’ వివేకానందుడు లేదా మరే ఇతర నాయకులపట్ల రోహిత్‌కు తన స్వంత అభిప్రాయాలను కలిగివుండే హక్కు ఉంది. మరి నేర నిరూపణ జరిగిన ఒక టెర్రరిస్టు యాకూబ్ మెమెన్ ఆత్మశాంతికి ప్రార్థనలను జరపడం ఎంతవరకు సముచితం? ఇది నిజంగా స్వేచ్ఛ నుంచి మరింత దూరం జరగడం కాదా?

srramanujan@gmail.com సెల్ : 8008322206