జాతీయ వార్తలు

‘రఫాలే’ విమానాల ఒప్పందంపై భారత్, ఫ్రాన్స్ సంతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 26: ‘రఫాలే’ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై భారత్, ఫ్రాన్స్ సంతకాలు చేశాయి. మొత్తం 36 రఫాలే యుద్ధ విమానాల కొనుగోలు నిమిత్తం ఇరు దేశాలు సోమవారం అంతర్ ప్రభుత్వ ఒప్పందాన్ని (ఐజిఎ) కుదుర్చుకున్నాయి. ధరకు సంబంధించిన సమస్యల వలన ఇందుకు సంబంధించిన తుది ఒప్పందం కుదరకపోయినప్పటికీ రెండు మూడు రోజుల్లో దీనిపై కూడా సంతకాలు జరుగుతాయని భావిస్తున్నారు. భారత్‌లో పర్యటిస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాన్ తీవ్రవాదంపై పోరాటం, పౌర అణు విద్యుత్, భద్రత తదితర రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రధాని మోదీతో సోమవారం విస్తృత చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం ఇరు దేశాల మధ్య కుదిరిన 14 ఒప్పందాల్లో 36 రఫాలే యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కూడా ఉంది. ఇందులో ఆర్థిక పరమైన అంశాలను పక్కనపెట్టి ఇరు దేశాలు అంతర్ ప్రభుత్వ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. తుది ఒప్పందానికి సంబంధించి కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయని, అయితే ‘సాధ్యమైనంత త్వరగా’ వాటిని కూడా పరిష్కరించుకుంటామని చర్చల అనంతరం సోమవారం న్యూఢిల్లీలో హోలాన్‌తో కలసి సంయుక్తంగా నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో మోదీ స్పష్టం చేశారు. రఫాలే యుద్ధ విమానాలకు సంబంధించి భారత్, ఫ్రాన్స్ మధ్య కుదిరిన అంతర్ ప్రభుత్వ ఒప్పందాన్ని ‘నిర్ణయాత్మకమైన ముందడుగు’గా హోలాన్ అభివర్ణించారు. తుది ఒప్పందానికి ప్రతిబంధకంగా ఉన్న ఆర్థిక సమస్యలు కూడా రెండు మూడు రోజుల్లోనే పరిష్కారమవుతాయని ఆయన అన్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించినప్పుడు 36 రఫాలే యుద్ధ విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇరు దేశాలు ఈ విషయంపై చర్చలు జరుపుతున్నాయి. అయితే దాదాపు 60 వేల కోట్ల రూపాయలకు లభిస్తాయనుకుంటున్న ఈ విమానాల ధరపై ఇరు పక్షాల మధ్య ఇప్పటికీ చర్చలు కొనసాగుతుండటంతో తుది ఒప్పందం కుదరలేదు. ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఉన్నత స్థాయి బృందం ప్రస్తుతం దీనిపై తుది చర్చలు జరుపుతోంది.