ఆంధ్రప్రదేశ్‌

రాజధాని నిర్మాణానికే శ్రమిస్తున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 25: రాష్ట్రం నడిబొడ్డు అమరావతి ప్రాంతంలో ప్రపంచంలోనే అద్భుతమైన రాజధాని నిర్మాణం కోసం తాను అహర్నిశలు శ్రమిస్తుంటే దీనికి ఎక్కడికక్కడ అవరోధాలు సృష్టించేందుకు కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తప్పుడు సమాచారంతో రైతులను రెచ్చగొట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని, రైతులు రెచ్చిపోతే చివరకు నష్టపోయేది ప్రభుత్వంతో పాటు తాము కూడా అనే విషయాన్ని గుర్తెరగాలని ఆయన కోరారు. ఇప్పటికే భూముల విలువ అనూహ్యంగా పెరుగుతోందనే విషయాన్ని గుర్తించాలంటూ తాను ఇంట్లో పడుకుని హాయిగా కాలక్షేపం చేయవచ్చని, అయితే అద్భుతమైన రాజధాని నిర్మాణం కోసమే కష్టపడుతున్నానని చెప్పారు. ఇక్కడి సిఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాజధాని నిర్మాణంపై జరుగుతున్న దుష్ప్రచారాలను చంద్రబాబు తిప్పికొట్టారు. తనపై వున్న విశ్వాసం, నమ్మకంతో దేశ, విదేశీ సంస్థలు, కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని చెప్పారు. ఈ దశలో రైతులు రెచ్చిపోయి రోడ్డెక్కి అలజడి సృష్టిస్తే ఇక్కడ ఏదో జరుగుతుందనే అనుమానంతో పెట్టుబడిదారులు వెనక్కిపోయే పరిస్థితి ఉత్పన్నమవుతుందని చంద్రబాబు హెచ్చరించారు. వాస్తవానికి రాష్ట్రంలో డబ్బు లేనప్పటికీ తన మేధస్సును ఉపయోగించి భూసమీకరణ ద్వారా 33వేల ఎకరాల భూమిని సమీకరించామన్నారు.
ప్రభుత్వానికి, రైతులకు లాభదాయకమైన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించామని, అయితే ఎవరికి వారు తన స్థలం పోకూడదు, రోడ్డు తన స్థలం పక్కనే రావాలని కోరుకుంటే రహదారులన్నీ వంకర టింకర్లగా మారతాయని, దీనివల్ల ఏం ప్రయోజనం ఉంటుందని ఆయన ప్రశ్నించారు. మాస్టర్ ప్లాన్‌లో మార్పులు, చేర్పులు చేస్తామంటూ కొందరు మంత్రులు సరైన అవగాహన లేకనే హామీలిస్తున్నారంటూ ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి పెట్టుబడులు పెట్టేందుకు చైనా, జపాన్ దేశాలు ముందుకొస్తున్నాయని చంద్రబాబు వెల్లడించారు. సింగపూర్, చైనా, జపాన్ వంటి దేశాలతో పాటు దేశ, విదేశాలకు చెందిన దాదాపు 38 ఆర్థిక సంస్థలు, కంపెనీలు వేర్వేరు రూపాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురాగా వాటితో చర్చలు ఉన్నతస్థాయిలోనే జరుగుతున్నాయని, ఆశాజనకమైన ఫలితాలు వస్తాయని భావిస్తున్నామన్నారు. అమరావతి ప్రాంతంలో గతంలో భూమి విలువ ఎంతుంది, ప్రస్తుతం ఎంత ఉందంటూ ఆయన ప్రశ్నించారు. ఇదే రాజధాని నిర్మాణం ఏ సుదూర ప్రాంతాల్లోనో చేపడితే ఇక్కడ భూముల విలువలు పెరిగేవా అని ప్రశ్నించారు. సౌర విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. అమరావతిలో ప్రయోగాత్మకంగా సోలార్ విద్యుత్, సోలార్ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. విదేశాల్లో పేరొందిన స్టాన్‌ఫోర్డ్, కేంబ్రిడ్జి, సింగపూర్ వంటి విదేశీ విశ్వవిద్యాలయాలు, ఎస్‌ఆర్‌ఎం, నిట్, అమృత వంటి స్వదేశీ విశ్వవిద్యాలయాలు స్థాపించేందుకు ముందుకొస్తున్నాయని వివరించారు.