బిజినెస్

రాబోయే ఐదేళ్లలో రూ. 65 వేల కోట్ల పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 25: రాబోయే ఐదేళ్లలో భారత్‌లోకి ఫ్రాన్స్ సంస్థలు సుమారు 65,000 కోట్ల రూపాయల పెట్టుబడుల (10 బిలియన్ డాలర్లు)ను తీసుకురానున్నాయని ఆ దేశ ఆర్థిక, ప్రజా పద్దుల శాఖ మంత్రి మిచెల్ శాపిన్ తెలిపారు. సోమవారం ఇక్కడ పారిశ్రామిక సంఘం ఫిక్కీ నిర్వహించిన భారత్-ఫ్రాన్స్ బిజినెస్ సెషన్‌లో ఆయన మాట్లాడారు. ‘గడచిన ఐదేళ్లకుపైగా కాలంలో ఏటా బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులను భారత్‌లో ఫ్రాన్స్ సంస్థలు పెట్టాయి. ఇవి రాబోయే ఐదేళ్లలో కనీసం 10 బిలియన్ డాలర్లుగా ఉంటాయని అంచనా వేస్తున్నాను.’ అని అన్నారు. 2020-22 నాటికి భారత సౌర విద్యుత్ శక్తి సామర్థ్యంలో ఫ్రాన్స్ సంస్థల వాటా 10 శాతంగా ఉంటుందని అనుకుంటున్నామన్నారు. కాగా, భారత్‌లో ఫ్రాన్స్ సంస్థలు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో మూడో అతిపెద్ద విదేశీ మదుపరిగా ఉందని మంత్రి వివరించారు.