రేవతి క్వీన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన ‘క్వీన్’ చిత్రం త్వరలో దక్షిణాది భాషల్లో రీమేక్ కానుంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ దర్శక నిర్మాత త్యాగరాజన్ సొంతం చేసుకున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఈ సినిమా పూర్తికావాలి. కానీ సరైన నటీనటులు దొరకకపోవడంతో ఇంకా పట్టాలెక్కలేదు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సీనియర్ నటి, దర్శకురాలు రేవతి సన్నాహాలు చేస్తోంది. ఆమె దర్శకత్వంలో ఈ చిత్రాన్ని త్యాగరాజన్ నిర్మిస్తాడని అంటున్నారు. కంగనారనౌత్ నటించిన హిందీ సినిమా రీమేక్‌లో ఏ హీరోయిన్ నటిస్తుందనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పటికే పలువురు నటీమణుల పేర్లు పరిశీలిస్తున్నారట. ఇదివరకే రేవతి మూడు చిత్రాలను దర్శకత్వం చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి వుంది.