హైదరాబాద్

కారు స్పీడ్‌ను తట్టుకోలేని ప్రతిపక్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్/బేగంపేట, ఫిబ్రవరి 5: గ్రేటర్ ఎన్నికల్లో తెరాసకు ఎదురులేకుండా పోయింది. కారు స్పీడుకు ప్రతిపక్ష పార్టీలు బేజారైపోయాయి. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ దూసుకుపోతున్న కారుకు బ్రేకులు వేయడం ఎవరి వల్ల కాలేదు. కౌంటింగ్ జరుపుతున్న ప్రతి చోట రౌండ్ రౌండుకు ఆధిక్యం కనపరుస్తూ విజయం దిశగా టిఆర్‌ఎస్ అభ్యర్థులు దూసుకుపోయారు. సర్కిల్ 18 పరిధిలోని సనత్‌నగర్, సికింద్రాబాద్ నియోజకవర్గంలోని తొమ్మిది డివిజన్‌లు మొత్తానికి మొత్తం తెరాస ఖాతాలోకి చేరిపోయాయి. సికింద్రాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పద్మారావు, సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్.. తమ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి తమకు ఎదురులేదని మరోసారి రుజువు చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని తార్నాక డివిజన్‌లో మాజీ మేయర్ బండ కార్తీకారెడ్డి, బౌద్దనగర్ డివిజన్‌లో ఆదం ఉమాదేవి.. గెలుపు కోసం గట్టిగా ప్రయత్నం చేసినప్పటికి కారు స్పీడును తట్టుకోలేకపోయారు. తెరాస నుంచి పోటీలో దిగిన అభ్యర్థులకు అంతగా రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ, కొత్తవారిని రంగంలోకి దింపి మంత్రి పద్మారావు గెలుపు బాధ్యతలను తమ భుజాలపై వేసుకుని ముందుకు నడిపించారు. గతంలో కార్పొరేటర్‌లుగా పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ తెరాస అభ్యర్థుల దాటికి తట్టుకోలేకపోయారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో మంత్రి పజ్జన్నకు ఎదురులేదని మరోసారి నిరూపించారు. సనత్‌నగర్ నియోజకవర్గంలో తలసానికి అంతగా పట్టులేదని టిడిపి నుంచి గెలిచి తెరాసలో చేరారని, సనత్‌నగర్ నుంచి ఎప్పుడు పోటీ చేసిన ఎదురుదెబ్బ తప్పదని పలికిన వారికి చెంపపెట్టుగా సనత్‌నగర్ నియోజకవర్గంలో మొత్తం డివిజన్‌లను తెరాస ఖాతాలో వేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాక డివిజన్‌లోతెరాస అభ్యర్థి ఆలకుంట సరస్వతి తమ సమీప అభ్యర్థి బండ కార్తీకరెడ్డిపై 12941 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అడ్డగుట్ట డివిజన్ తెరాస అభ్యర్థిని ఎస్.విజయకుమారి తమ సమీప అభ్యర్థిపై 14265 ఓట్లు మెజారిటీ సాధించారు. మెట్టుగూడ తెరాస అభ్యర్థిని పిఎన్ భార్గవి తమ సమీప టిడిపి అభ్యర్థిని కటారి గాయత్రిపై 8032 ఓట్ల మెజారిటీ సాధించారు. సీతాఫల్‌మండి డివిజన్ తెరాస అభ్యర్థిని సామల హేమ.. టిడిపి అభ్యర్థి మేకల కీర్తిపై 15071 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బౌద్దనగర్ డివిజన్ తెరాస అభ్యర్థిని బి.్ధనంజనబాయి తమ సమీప బిజెపి అభ్యర్థిని స్వరూపగౌడ్‌పై 9934 ఓట్ల మెజారిటీని సాధించారు. సనత్‌నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట్ డివిజన్ తెరాస అభ్యర్థిని కురుమ హేమలత తమ సమీప అభ్యర్థిని శ్రావణిపై 11288 మెజారిటీ సాధించారు. రాంగోపాల్‌పేట్ డివిజన్‌లో అత్తెల్లి అరుణ తమ సమీప బిజెపి అభ్యర్థిని ప్రియాంకవర్మపై 6499 మెజారిటీతో గెలుపొందారు. బేగంపేట డివిజన్ తెరాస అభ్యర్థిని తరుణి తమ సమీప టిడిపి అభ్యర్థి కూన సత్యకళపై 5751 ఓట్లతో గెలుపొందారు. మోండామార్కెట్ డివిజన్ తెరాస అభ్యర్థిని ఆకుల రూప తమ సమీప టిడిపి అభ్యర్థి అనిత యాదవ్‌పై 6256 ఓట్లతో విజయం సాధించారు.
అందరి ఊహలు తారుమారు
అల్వాల్‌లో ఏకపక్ష నిర్ణయం.
అల్వాల్: అల్వాల్‌లో గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు ఓటములపైన అందరి అంచనాలు తారుమారైనాయి. అధికార పార్టీ సైతం ఉహించని విధంగా ప్రజలు ఏకపక్ష తీర్పునిచ్చారు మచ్చబొల్లారం కార్పొరెటర్‌గా పోటీ చేసిన రాజ్‌జీతేంధ్రనాత్‌పైన ప్రజల్లో వ్యతిరేకత ఉందని ప్రచారం జరిగినా.. అనుమానాలను పటాపంచలు చేస్తూ ప్రజలు తీర్పునిచ్చారు. మచ్చబొల్లారం డివిజన్‌లో 47681 ఓటర్లు ఉండగా 17029 మంది ఓటు వేశారు. జీతేంద్రనాథ్‌కు 10616 ఓట్లు వచ్చాయి. రెండవ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సూర్యకిరణ్ నిలిచారు. అల్వాల్ డివిజన్ మహిళ జనరల్ స్థానంలో 49894 ఓట్లు కాగా అందులో 21743 తెరాస అభ్యర్థికి 11537 ఓట్లతో రెండవ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి సుజాత గోపాల్ రెడ్డి నిలిచారు. మూడో స్థానంలో టిడిపి అభ్యర్థి సౌజన్య, నాలుగో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నిలిచారు.
వెంకటాపురం డివిజన్ ఎస్సీ జనరల్ స్థానంలో 39037 ఓట్లు కాగా 17029 ఓటు వేశారు. తెరాస అభ్యర్థి సబితా కిషోర్‌కు 10616 ఓట్లు వచ్చాయి. రెండవ స్థానంలో బిజెపి అభ్యర్థి, మూడవ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి టి.మోహన్ నిలిచారు. గెలిచిన అభ్యర్థుల ర్యాలీలు నిర్వహించారు. అల్వాల్ లయోల కళాశాలలో నిర్వహించిన కౌటింగ్‌లో గెలిచిన అభ్యర్థులు కార్యకర్తల హర్షధ్వనాలతో ర్యాలీ నిర్వహించారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి.. దగ్గరుండి కౌటింగ్‌ను పర్యవేక్షించారు. గెలిచిన అభ్యర్థులకు అతనే ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రమేష్, అల్వాల్ ఎసిపి రఫిక్, సిఐ ఆనంద్‌రెడ్డి బందోబస్సు పర్యవేక్షించారు.
సైదాబాద్‌లో సింగిరెడ్డిదే విజయం
సైదాబాద్: సైదాబాద్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్ధి సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి విజయం సాధించారు. గత బల్దియా ఎన్నికల్లో ఇక్కడ గెలిచిన సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఈసారి రిజర్వేషన్‌ల మేరకు తన సతీమణి స్వర్ణలతారెడ్డిని ఎన్నికల బరిలో నిలిపి మరోసారి విజయం సాధించారు. ఎన్నికల్లో 21160 ఓట్లు నమోదు కాగా స్వర్ణలతారెడ్డి 7వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. శుక్రవారం సాయంత్రం ఫలితాలు వెలువడిన తరువాత సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి నివాసం వద్ద టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు గెలుపు సంబరాలు చేశారు. మిఠాయిలు పంచి టపాకాయలు పేల్చి టిఆర్‌ఎస్ అనుకూల నినాదాలతో హోరెత్తించారు.
ఐఎస్‌సదన్‌లో..
ఐఎస్‌సదన్ డివిజన్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్ధి సామ స్వప్న సుందర్‌రెడ్డి విజయం సాధించారు. ఎన్నికల్లో 22065 ఓట్లు నమోదు కాగా నాలుగు రౌండ్ల ద్వారా లెక్కింపు నిర్వహించారు. నాలుగు రౌండ్లలోను ఆమె స్పష్టమైన మెజారిటీ సాధించారు. సుమారు 12వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఐఎస్‌సదన్‌లో టిఆర్‌ఎస్ శ్రేణులు విజయ సంబరాలు నిర్వహించారు.
సరూర్‌నగర్‌లో..
సరూర్‌నగర్: సరూర్‌నగర్‌ను ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దుతానన్ని కార్పొరేటర్‌గా ఎన్నికైనా తెరాస అభ్యర్థి పి.అనితా దయాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సరూర్‌నగర్ డివిజన్ నుంచి తెరాసా కార్పొరేటర్ అభ్యర్థిగా పొటీ చేసిన అనితా దయాకర్‌రెడ్డి శుక్రవారం వెల్లడించిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలల్లో 6211 ఓట్లతో కార్పొరేటర్‌గా ఘన విజయం సాధించారు. మొదటి నుంచి ఆధిక్యంలో కొనసాగుతూ.. తెదేపా, కాంగ్రెస్ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టించారు.
అనితా దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెరాస చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఘన విజయం అందించారని అన్నారు. డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్ని అనితా దయాకర్‌రెడ్డి తెలిపారు.
బాలానగర్, ఫతేనగర్‌లో..
బాలానగర్: కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలోని బాలానగర్, ఫతేనగర్, ఓల్డ్ బొయిన్‌పల్లి డివిజన్లలో టిఆర్‌ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. బాలానగర్ డివిజన్ పరిధిలోని టిఆర్‌ఎస్ అభ్యర్థి కాండూరి నరేంద్రాచార్య 8516 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఫతేనగర్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్థి పండాల సతీష్‌గౌడ్ 5415 ఓట్లతో విజయం సాధించారు. ఓల్డ్‌బోయిన్‌పల్లిలో ముద్దం నర్సింహ యాదవ్ 8092 ఓట్ల మెజారిటీ గెలుపొందారు.
శేరిలింగంపల్లిలో టిఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్
శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పది డివిజన్లలనూ టిఆర్‌ఎస్ విజయఢంకా మోగించింది. జంట సర్కిళ్లలోని ఏడు డివిజన్లలో టిడిపి రెండో స్థానంతో, కాంగ్రెస్ మూడోస్థానంతో సరిపెట్టుకున్నాయి. శేరిలింగంపల్లి డివిజన్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్ సమీప అభ్యర్థి రాజుయాదవ్ (టిపిపి)పై 8643 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. చందానగర్ డివిజన్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్థి బొబ్బ నవతారెడ్డి 2831 ఓట్ల మెజారిటీతో టిడిపి-బిజెపి అభ్యర్థి ఊరిటి వసుంధరపై విజయం సాధించారు. మాదాపూర్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్థి జగదీశ్వర్‌గౌడ్ 6005ఓట్ల మెజారిటీతో టిడిపి-బిజెపి అభ్యర్థి ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్‌పై గెలిచారు. హఫీజ్‌పేటలో టిఆర్‌ఎస్ అభ్యర్థి వి.పూజిత 8619ఓట్ల తేడాతో టిడిపి అభ్యర్థి షాయనాజ్ బేగంపై విజయఢంకా మోగించారు. కొండాపూర్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్థి హమీద్‌పటేల్ 7334ఓట్లతో టిడిపి అభ్యర్థి నీలం రవీందర్ ముదిరాజ్‌పై గెలిచారు. గచ్చిబౌలిలో టిఆర్‌ఎస్ అభ్యర్థి కామిశెట్టి సాయిబాబా 5860 ఓట్లతో బిజెపి అభ్యిర్థి రామారావుపై గెలుపొందారు. మియాపూర్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్థి మేక రమేశ్ సమీప అభ్యర్థి బండారు మోహన్ ముదిరాజ్(టిడిపి)పై 1030 ఓట్లతో విజయం సాధించారు. మాజీ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ మాదాపూర్ నుంచి, ఆయన సతీమణి వి.పూజిత హఫీజ్‌పేట నుంచి గెలుపొందడం విశేషం. కార్పొరేటర్లకు ధ్రువీకరణ పత్రాలను రిటర్నింగ్ అధికారులు అందించారు.
గడ్డిఅన్నారం, చైతన్యపురి డివిజన్‌లో..
దిల్‌సుఖ్‌నగర్: గడ్డిఅన్నారం, చైతన్యపురి డివిజన్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్థులు భవాణి ప్రవీణ్ కుమార్, జిన్నారం విఠల్‌రెడ్డి అఖండ విజయాన్ని సాధించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకం తమ విజయానికి బాటలు వేశాయని అన్నారు. నగరంలో బస్తీలు అనేవి లేకుండా చేయడమే ముఖ్యమంత్రి కేసిఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం భోజనం పెట్టిన ఘనత కేసిఆర్‌కే దక్కుతుందని చెప్పారు. 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా, ఆసరా పెన్షన్లు వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.