బిజినెస్

రామగుండంకు మరిన్ని వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, ఫిబ్రవరి 12: రామగుండం ఎన్‌టిపిసి వద్ద మరో 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోది హామీ ఇవ్వడంతో పనులు మరింత వేగవంతం అవుతున్నాయి. శుక్రవారం ఢిల్లీలో ప్రధానిని కలిసిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రామగుండం ఎన్‌టిపిసి 4వేల మెగావాట్ల విద్యుత్ యూనిట్ల ఏర్పాటుపై హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ బిల్లులో ఎన్‌టిపిసి నుండి 4 వేల మెగావాట్ల విద్యుత్‌ను అందించే ఒప్పందంలో భాగంగా హామీని ప్రకటించారు. ఇందుకోసం ఇప్పటికే రామగుండం ఎన్‌టిపిసి తెలంగాణ స్టేజి-1 పేరిట 1,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిపే 2 యూనిట్ల కోసం ప్రస్తుతం 2,600 మెగావాట్ల ప్లాంట్‌ను ఆనుకొని ఉన్న పాత పీకే రామయ్య కాలనీలో భూమిని చదును చేసి సిద్ధంగా ఉంచారు. స్టేజి-1కు సంబంధించిన పర్యావరణ అనుమతి, ఒడిశాలోని నైనీ బ్లాక్ నుండి కోల్ లింకేజ్, ఫైనాన్స్ అనుమతులు తదితర వాటిని పొంది సిద్ధంగా ఉన్నారు. ఎన్‌టిపిసి తెలంగాణ స్టేజి-1ను మరికొద్ది రోజుల్లోనే నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కెసిఆర్‌ల చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. రామగుండం ఎన్‌టిపిసి వద్ద ముందుచూపుతో సుమారు 10 వేల ఎకరాల భూమిని సేకరించి ఉంచడంతో ప్రస్తుతం ఉత్పత్తి జరుపుతున్న 2,600 మెగావాట్లతోపాటు మరో 4 వేల మెగావాట్ల విద్యుత్ యూనిట్లను నిర్మించుకునేందుకు భూమి అందుబాటులో ఉంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం కూడా రామగుండం ఎన్‌టిపిసి వద్దనే తెలంగాణ విద్యుత్ అవసరాలు తీర్చేందుకు 4 వేల మెగావాట్ల విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. కాగా, యాష్‌పాండ్ కోసం మరో 600 ఎకరాల భూమి అవసరం ఉండగా, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఎన్‌టిపిసి 4,000 మెగావాట్లను వేగవంతంగా చేపట్టడానికి సిద్ధమవుతుంది. దీంతో రామగుండం, ఎన్‌టిపిసి విద్యుదుత్పత్తిలో మరింత ఉన్నత స్థాయికి ఎదుగనుంది.