రాష్ట్రీయం

రిక్షా, ఆటోవాలాలకూ ఇఎస్‌ఐ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: రిక్షా కార్మికులు, ఆటో రిక్షా డ్రైవర్లకూ త్వరలో అసంఘటిత రంగ కార్మికుల ఆరోగ్య పథకాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. శుక్రవారం కార్మిక రాజ్య బీమా సంస్ధ 168వ సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 35 కోట్ల మంది కార్మికులకు సేవలు అందించేలా సంస్కరణలు తీసుకుని వస్తున్నామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో విజయవాడలోని ఇఎస్‌ఐసి ఉప ప్రాంతీయ కార్యాలయం స్థాయిని పెంచామని, ఇకపై విజయవాడ కార్యాలయం ప్రాంతీయ కార్యాలయంగా సేవలందిస్తుందని ఆయన చెప్పారు. దీనికి డైరెక్టర్‌గా శివప్రసాద్‌ను నియమించినట్లు ఆయన తెలిపారు. తిరుపతిలో ఉప ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇఎస్‌ఐసి సేవలు విస్తరించే ప్రాంతాల్లో రెండేళ్ళ పాటు యాజమాన్య సంస్ధ చెల్లించే వాటా 3 శాతంగా, ఉద్యోగి వాటా 1 శాతంగా ఉంటుందని తెలిపారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే కార్మికుల ఆశా, మధ్యాహ్న భోజన పథకం, అంగన్‌వాడి తదితర కార్మికులకూ వైద్య సేవలు అందించనున్నమట్లు కేంద్ర మంత్రి దత్తాత్రేయ తెలిపారు. అయితే వారు నెలకు 250 రూపాయలు చెల్లించినట్లయితే భార్యా, భర్తలు, ఇద్దరు పిల్లలకు వైద్య సౌకర్యం లభిస్తుందని అన్నారు.
ఇలాఉండగా రాజ్యసభ సభ్యురాలు, ప్రముఖ బాలీవుడ్ నటి హేమమాలిని నటించిన ఇఎస్‌ఐసి-2.0 టివీసి/్ఫల్మ్‌ను కేంద్ర మంత్రి దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి విడుదల చేశారు.