రాష్ట్రీయం

రైతు ఆత్మహత్యలపై మీ వైఖరేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యల నివారణకు ఏంచర్యలు తీసుకున్నారో వివరించాలని హైకోర్టు రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. గత ఏడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరిలో సంభవించిన రైతు మరణాలపై సమగ్ర వివరాలతో నివేదిక అందించాలని హైకోర్టు ఆదేశించింది. వ్యవసాయ జన చైతన్య సమితి, పాకాల శ్రీహరిరావులు వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసేల్, జస్టిస్ పి నవీన్‌రావులతో కూడిన బెంచ్ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను రైతుల ఆత్మహత్యల నివారణపై వివరణ కోరింది. కోర్టులో వ్యాజ్యాలు దాఖలైన తర్వాత అయినా ఇరు ప్రభుత్వాలు రైతుల ఆత్మహత్యల నివారణకు చొరవ తీసుకున్నారా? లేదా? అని ఆయా ప్రభుత్వాల న్యాయవాదులను బెంచ్ ప్రశ్నించింది. ఇందుకు స్పందించిన తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది ఎస్ శరత్‌కుమార్ న్యాయస్ధానానికి వివరణ ఇస్తూ తెలంగాణలో చాలా వరకు రైతుల ఆత్మహత్యలు తగ్గాయని, అందుకు తగిన ఆధారాలు సమర్పిస్తామని వెల్లడించారు. రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి ఉన్న కారణాల్లో ప్రధానమైనది ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి రుణం తీసుకోవడమేనని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పడం సరికాదని ఫిర్యాది తరఫు న్యాయవాది వాదించారు. ఫిర్యాదిదారుల ప్రతిస్పందనపై బెంచ్ తెలంగాణ సర్కార్‌ను వివరణ కోరుతూ, నివారణకు ఏరకమైన చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ప్రభుత్వం అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసి ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి రుణాలు తీసుకోవద్దంటూ రైతుల్లో చైతన్యం తీసుకొచ్చారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. కేవలం వ్యవసాయం కోసమే రుణం తీసుకోవడం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారా? అని కోర్టు ప్రశ్నించింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరామ్ తరఫున హాజరైన న్యాయవాది బి రచనారెడ్డి జోక్యం చేసుకుని కోర్టుకు వివరణ ఇస్తూ రైతులు విద్య, వివాహాలకు రుణాలు తీసుకుంటున్నారని, అయితే ఈ రుణాలు తీర్చాలన్నా వ్యవసాయంపైన వచ్చే ఆదాయంతోనేనని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం, పిటీషనర్ల తరఫు వాదనలు విన్న బెంచ్ ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వల్ల ఆత్మహత్యకు పాల్పడిన రైతుల వివరాలతో కూడిన అఫిడవిట్‌ను దాఖలు చేయాలని తెలంగాణ సర్కార్‌ను ఆదేశించింది. అదేవిధంగా ఈరకంగా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వేధింపుల వల్ల రైతులు చనిపోయిన సంఘటనలు కనీసం ఐదు ఉండేవిధంగా అఫిడవిట్‌లో పొందుపర్చాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది మాట్లాడుతూ 2014లో ప్రభుత్వం కమిటీని నియమించిందని తెలిపారు. రైతుల ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవడం జరిగిందని, కొంత సమయమిస్తే అన్ని వివరాలను కోర్టు ముందు ఉంచుతామని కోరడంతో మూడు వారాలకు కేసును వాయిదా వేస్తూ బెంచ్ నిర్ణయం తీసుకుంది.