క్రీడాభూమి

రియాజ్, షెజాద్‌లకు జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, ఫిబ్రవరి 15: పాకిస్తాన్ క్రీడాకారులకు వాహెబ్ రియాజ్, అహ్మద్ షెజాద్‌లకు అధికారులు జరిమానా విధించారు. దుబాయ్‌లో పిఎస్‌ఎల్ టోర్నీలో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్, పెషావల్ జల్మీ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు వీరిద్దరూ పరస్పరం దూషించుకున్నారు. అంతటితో ఆగకుండా ఒకరినొకరు తోసుకున్నారు. మ్యాచ్ రిఫరీగా వ్యవహరించిన రోషన్ మహానామా ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఇద్దరు ఆటగాళ్లను హెచ్చరించింది. మరోసారి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేసింది. షెజాద్‌కు 30, రియాజ్‌కు 40 శాతం చొప్పున మ్యాచ్ ఫీజులో జరిమానా విధించింది.