క్రీడాభూమి

రంజీ ట్రోఫీ ఫైనల్‌కు సౌరాష్ట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడోదర, ఫిబ్రవరి 15: సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీ ఫైనల్‌లో ఈ జట్టు అస్సాంను 10 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనాద్కత్ 45 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టి, సౌరాష్ట్ర విజయంలో కీలక పాత్ర పోషించాడు. అస్సాం తొలి ఇన్నింగ్స్‌లో 234 పరుగులు చేయగా, అందుకు సమాధానంగా సౌరాష్ట్ర 353 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 119 పరుగులు వెనుకబడిన అస్సాం రెండో ఇన్నింగ్స్‌లో 39.1 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. దీనితో విజయానికి అవసరమైన 21 పరుగులను సౌరాష్ట్ర ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా సాధించింది.