క్రీడాభూమి

రిటైరయ్యే ఆలోచన లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: రిటైర్మెంట్‌పై తనకు ఇప్పుడే ఎలాంటి ఆలోచన లేదని భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న అతను విలేఖరులతో మాట్లాడుతూ రిటైర్మెంట్ గురించి ఆలోచించడం లేదని, ప్రస్తుతం తన దృష్టి ఆసియా చాంపియన్‌షిప్, టి-20 ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలపైనే కేంద్రీకృతమైందని తెలిపాడు. ఈ రెండు టోర్నీలు ముగిసిన తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనాల్సి ఉందన్నాడు. తీరిక లేని షెడ్యూల్ ముందు ఉందని, ఈ సమయంలో రిటైర్మెంట్ గురించి ఎవరు ఆలోచిస్తారని 34 ఏళ్ల ధోనీ చెప్పాడు.
దానంతట అదే వెళుతోంది..
భారత జట్టు ఆటో-పైలెట్ మోడ్‌లో ఉందని, ప్రస్తుతం దానంతట అదే ముందుకు వెళుతున్నదని ధోనీ వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియాను, ఆ వెంటనే శ్రీలంకను టి-20 ఫార్మెట్‌లో చిత్తుచేసి, మంచి ఫామ్‌లో ఉన్న జట్టుకు ప్రత్యేకించి మార్గదర్శకం చేయాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పాడు. ఆటగాళ్లంతా ఫామ్‌లోనే ఉన్నారని చెప్పాడు. ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేవన్నాడు.
కోహ్లీ అభిమానికి బెయిల్ నిరాకరణ
లాహోర్, ఫిబ్రవరి 19: భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ పట్ల అభిమానాన్ని వ్యక్తం చేసినందుకు దేశద్రోహం ముద్ర వేయించుకొని, ప్రస్తుతం జైల్లో ఉన్న 22 ఏళ్ల ఉమర్ ద్రాజ్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను పంజాబ్ ప్రావీన్స్‌లోని ఒకారా జిల్లా కోర్టు నిరాకరించింది. కోహ్లీ పట్ల అభిమానం పెంచుకున్న ద్రాజ్ తన ఇంట్లో అతని ఫొటోలు పెట్టుకున్నాడు. భారత జాతీయ పతాకం కూడా వాటిలో ఉండడం సమస్యకు కారణమైంది. భారత పతాకాన్ని ఇంట్లో ఉంచడం ద్వారా దేశ ద్రోహానికి పాల్పడుతున్నాడంటూ ద్రాజ్‌పై నేరాన్ని ఆరోపించిన పోలీసులు అతనిని జైల్లోకి నెట్టారు. బెయిల్ పిటిషన్‌ను కింది కోర్టు తిరస్కరించడంతో, సెషన్స్ కోర్టులో అప్పీల్ చేస్తామని అతని తరఫు లాయర్ ప్రకటించాడు. ఇలావుంటే, నేరం రుజువైతే ద్రాజ్‌కు పదేళ్ల వరకూ జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది.