అక్షర

రుచి తగ్గని ‘పాత పానీయం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవుడి కథ
-ఎమ్.ఇల్విన్ అండ్ వై.సెగాల్
పేజీలు: 200..వెల: రు.160
ప్రగతి పబ్లిషర్స్, శ్రీ శంకర్ కాలనీ, ఎల్‌బినగర్,
హైదరాబాద్, ఫోన్: 8096314553

కవరు పేజీ మీద పుస్తకం పేరు ఉంది. దానిపైన మూడు లైన్లలో పుస్తకం సారాంశం ఉంది. అక్కడ మానవ పరిణామ క్రమం అనే మాట వాడారు. పరిణామంలో క్రమం లేదు. అది ఎవరో వేసిన పథకం ప్రకారం జరిగిన కార్యక్రమం కాదు. ప్రపంచమంతటా పలుచోట్ల జరిగిన మార్పులను అర్ధం చేసుకునే ప్రయత్నంలో వాటిని ఒక వరసలో పెట్టే ప్రయత్నం జరిగింది అంతే. మానవుని కథలో ఒక క్రమం ఉండాలని ఎవరూ అనుకోవడం లేదు.
ఈ పుస్తకం ముందు రష్యన్ భాషలో వచ్చింది. ఈ రచయితలకు అప్పట్లో మంచి పేరు కూడా వచ్చింది. రష్యన్ సైన్స్, బాలసాహిత్యం, తదితర రచనలు అప్పట్లో కుప్పతెప్పలుగా తెలుగులో కూడా వచ్చాయి. ప్రస్తుత ప్రచురణ ఆ రకంగా ఒక పునర్ముద్రణ.
మానవ చరిత్ర గురించిన అవగాహన, కాలక్రమంలో పరిశోధనల కారణంగా చాలా మారిపోయింది. కొత్త అవగాహనను పెంచే పుస్తకాలు చాలా వచ్చాయి. వాటిని తెలుగులో అందించడంలో కష్టాలున్న మాట నిజమే. తెనాలి రామలింగడు తప్ప తెలుగువారికి కొత్త రచయితలతో, కొత్త పుస్తకాలతో పనిలేదు. మనిషి పంపిన నౌకలు చివరి గ్రహాలను దాటి విశ్వం లోతులకు చేరిన తరువాత కూడా సౌర మండలం పుట్టుక గురించి చెప్పుకుంటు మిగిలాము మనం.
పరిణామం గురించి ఈ పుస్తకంలో చెప్పిన అంశాలు, నిజానికి ఆ అంశాన్ని అకడమిక్ పద్ధతిలో అధ్యయనం చేసిన వారికి కూడా తెలియవు. ఇది అసలైన రష్యన్ దృష్టికోణం. అట్టని పనికి రానిది మాత్రం కాదు. పాత పుస్తకంలోని బొమ్మలను కూడా చక్కగా వాడుకుంటూ సాగిన రచన చదివిస్తుంది. చాలా సంగతులు తెలుస్తాయి. అయితే, అందులో కాలదోషం పట్టిన ఆలోచనలు కూడా ఉన్నాయని గుర్తుంచుకుని చదవాలి.
అనువాదకుల గురించి పుస్తకంలో వివరాలు లేవు. అసలు రచనలాగే, అనువాదం కూడా చాలా బాగుంది. కథ చదువుతున్నంత సులభంగా చదువుతూ పోవచ్చు. కానీ అడుగడుగునా ఇది మన పుస్తకం కాదు అన్న భావన మిగులుతుంది. ఆ మాటల తీరే వేరు! పనిముట్లు, బొమ్మలు గీయడం, ఇళ్లు, మచ్చిక జంతువులు, అట్లా అన్నీ తెలిసిన సంగతులే. ఇంతకు ముందు మానవ పరిణామం గురించి తెలియని వారికి కూడా ఇవన్నీ సులభంగానే అర్ధమవుతాయి.
సైన్సులో అనువాదాలు వస్తున్నాయి. సైన్సు రచనలు సులభంగా అందాలంటే అదే సులభ పద్ధతి. పునర్ముద్రణలు వేస్తున్నవారు మాత్రం, వాటిని వీలైనంత వరకు పరిష్కరించి అచ్చొత్తిస్తే మరింత బాగుంటుంది.
ఈ రచయితలే రాసిన ‘మీకు తెలుసా?’ అనే పాత పుస్తకం ఒకటి ఉంది. వీళ్ల రచనలను అందరూ స్వంతం చేసుకున్నారు. ఆ పుస్తకం కూడా ఎవరో ఒకరు వేయకపోరు! కొత్త పుస్తకాలు రాయించేవారు లేరు. రాసేవారూ ఉన్నట్టు లేదు. కనుకనే ఈ ‘కొత్త సీసాలో పాత పానీయాలు!’

-స్వాతి