రాష్ట్రీయం

రోహిత్ దళితుడు కాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో రీసెర్చి స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్య వివాదం కొత్త మలుపు తిరిగింది. రోహిత్ దళితుడు కాదని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపించిన నివేదికలో స్పష్టం చేసింది. రోహిత్ ఆత్మహత్యకు పురిగొలిపారనే ఆరోపణలతో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అప్పారావు, కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు కావడంతో కేసులో రోహిత్ కులానికి ప్రాధాన్యత సంతరించుకుంది. రోహిత్ అసలు దళితుడే కానపుడు కేంద్ర మంత్రి, విసిలపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయడం సరికాదని, రోహిత్ దళితుడు కాడని వచ్చిన ఆరోపణలపై స్పందించిన కేంద్రం ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ మేరకు తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ అధికారులు రోహిత్ తండ్రి వేముల మణికుమార్, తల్లి రాధిక, మణికుమార్ బంధువులు, రోహిత్ సోదరుడు, రోహిత్ అమ్మమ్మల వివరణలతో పాటు నీటిపారుదల శాఖలో తండ్రి గతంలో సమర్పించిన పత్రాలను సైతం సేకరించి వాస్తవాలను తెలుసుకున్నారు. 1989 జనవరి 30న పుట్టినట్టు ఎస్సీ కులానికి చెందిన వాడని పేర్కొంటూ రోహిత్‌కు జారీ చేసిన సర్ట్ఫికెట్‌పై ఎమ్మార్వో కె. సత్యనారాయణ మూర్తి సంతకం చేశారు. గురజాల వడ్డెర వీధిలో డోర్ నెంబర్ 6-79తో ఈ సర్ట్ఫికేట్ పొందారు. అయితే గతంలో మిగిలిన వారి సర్ట్ఫికెట్లలో వడ్డెర కులానే్న ప్రస్తావించినట్టు తెలంగాణ పోలీసులు కేంద్ర హోంశాఖకు పంపిన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు సైతం ఒక అఫిడవిట్ దాఖలు చేసినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సైబరాబాద్ మాదాపూర్ అసిస్టెంట్ కమిషనర్ ఎం రమణ కుమార్ గుంటూరు జిల్లాకు వెళ్లి దర్యాప్తు నిర్వహించినట్టు తెలిసింది. గురజాలలో వేముల రోహిత్ కుటుంబీకులు రాఘవమ్మ, వెంకటేశ్వర్లు వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. గ్రామ సర్పంచ్ మహంకాళి సీతమ్మ కూడా రోహిత్ దళితుడు కాదని పేర్కొన్నట్టు నివేదికలో వివరించారు. ఎమ్మార్వో జివిఎస్ ఫణీంద్ర సైతం రోహిత్ కుల ధృవీకరణ పత్రాన్ని జనవరి 19న ఖరారు చేశారని, దాని ప్రకారం రోహిత్ వడ్డెర కులానికి చెందిన వాడేనని అధికారులు పేర్కొన్నారు. వాస్తవాన్ని పక్కన పెట్టి రోహిత్ రికార్డుల్లో మాత్రం ‘ఎస్సీ’గానే పేర్కొన్నట్టు తెలిసింది. వడ్డెర కులానికి చెందిన వారు తనను దత్తత తీసుకున్నారని, అంతే తప్ప తాము ఎస్సీ కులానికి చెందిన వారమేనని రోహిత్ తల్లి రాధిక పేర్కొన్నారని కూడా నివేదికలో వివరించారు. 1985లో తన భర్తతో విడాకులు తీసుకున్నామని, ముగ్గురు పిల్లలతో కలిసి ఎస్సీలు నివసించే ప్రాంతంలోనే తాను జీవించానని రాధిక పేర్కొన్న విషయాన్ని నివేదికలో ప్రస్తావించారు.
సాంకేతిక అంశాలు
రికార్డుల ప్రకారం రోహిత్ కుటుంబం ఎస్సీ కులానికి చెందిన వారే అయినా, వాస్తవికంగా వడ్డెర కులానికి చెందిన వారని ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది. అయితే మొత్తం తిరకాసు అంతా ఇక్కడే ఉంది. వడ్డెర కులానికి చెందినవారేనని ఖరారు చేసినా, తాము ఎస్సీలు నివసించే ప్రాంతంలోనే జీవించామని, కనుక తాము ఎస్సీలుగానే పరిగణించబడతామని రాధిక కుటుంబం వాదిస్తోంది. దీనికి బలం చేకూరుస్తూ గతంలో ఈ తరహా తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చిందని సీనియర్ ఐఏఎస్ అధికారి కె. రాజు వ్యాఖ్యానించారు.