కరీంనగర్

దేశంలో రైతులకు ఎరువుల కొరత రానివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జనవరి 22: దేశంలో ప్రస్తుతం రైతులెదుర్కొంటున్న ఎరువుల కొరతకు కేంద్రం త్వరలోనే చరమగీతం పాడనుందని, ఇందులో భాగంగానే కాంగ్రెస్ హయాంలో దేశవ్యాప్తంగా మూతపడ్డ 8 ఎరువుల కర్మాగారాలను పునఃప్రారంభిస్తున్నట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహెర్ స్పష్టంచేశారు. ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌గా రూపాంతరం చెందిన మూతపడ్డ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పరిశీలించేందుకు శుక్రవారం ఆయన జిల్లాకు వచ్చారు. ఈసందర్బంగా జిల్లాకేంద్రంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, ఇప్పటికే ఆరు కర్మాగారాలు తెరిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు, మిగతా రెండింటిని కూడా త్వరలోనే తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విదేశాలనుంచి ఎరువులు దిగుమతులవుతున్న నేపథ్యంలో రైతాంగం ధరల బాధల నెదుర్కొంటుందని, ఏటా 5 మిలియన్ మెట్రిక్ టన్నుల యూరియాను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు, వీటి పునరుద్ధరణతో దిగుమతుల భారం తప్పుతుందన్నారు. రాబోయే 4 ఏళ్ళ వరకు ఎరువులపై ఎలాంటి ధరలు పెంచబోమని స్పష్టంచేశారు. వ్యవసాయ రంగ అభివృద్ధితోనే దేశం ఆర్థికంగా పురోగతి చెంది, నిరుద్యోగ సమస్య దూరమవుతుందనే భావనతో ప్రధాని మోదీ ఈ రంగంపై దృష్టి సారించినట్లు వెల్లడించారు. జిల్లాలోని రామగుండం ఎరువుల ప్యాక్టరీ పునరుద్ధరణతో తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్టల్రో కూడా రైతులకు ఎరువుల ఇబ్బందులు తొలగుతాయన్నారు. ఉత్పత్తి మొదలుపెట్టిన అనంతరం ఎలాంటి అంతరాయాలు కలుగకుండా కర్మాగారం యూరియా ఉత్పత్తి చేస్తుందని వివరించారు. తెలంగాణలో గోదావరి నదితో పాటు ఇతర ప్రాజెక్టులు కూడా అధికంగా ఉన్న దృష్ట్యా భవిష్యత్‌లో వ్యవసాయరంగం మరింత అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని, అంతరాష్ట్ర ప్రాజెక్టు అయిన ప్రాణహిత - చేవెళ్లే నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగించేందుకు కేంద్రం కూడా చొరవచూపుతుందని, దీంతో రాష్ట్రంలో మరో 20 లక్షల ఎకరాల సాగుకు అవకాశం ఏర్పడబోతుందన్నారు. పరిశ్రమల పునఃప్రారంభంతో నిరుద్యోగ సమస్యను అధిగమించవచ్చని, వీటిలో స్థానిక యువతకే అధిక ప్రాధాన్యతనిచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణలో బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉన్న దృష్ట్యా బొగ్గు ఆధారిత పరిశ్రమలు నెలకొల్పే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని, రాష్ట్రాలకు అభివృద్ధినిధుల కేటాయింపులో ఎలాంటి వివక్షను కేంద్రం ప్రదర్శించబోదని, అన్ని రాష్ట్రాలను సమానంగా భావించి నిధులు విడుదల చేస్తున్నామన్నారు. రహదారుల నిర్మాణంతోనే శరవేగంగా అభివృద్ధి సాధ్యమైన నేపథ్యం జిల్లాలో 195 కిమీల మేర జాతీయ రహదారులు నిర్మాణానికి అనుమతులు మంజూరుచేసినట్లు తెలిపారు. ఈసమావేశంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, నాయకులు మీస అర్జున్‌రావు, కర్ర సంజీవరెడ్డి, గంటల రమణారెడ్డి, పెండ్యాల సాయికృష్ణారెడ్డి, కోమల ఆంజనేయులు, కాసీపేట లింగయ్య పాల్గొన్నారు.