బిజినెస్

రాబోయే ఐదేళ్లలో 8-10 శాతం వృద్ధిరేటు అందుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నిర్మాణాత్మక సంస్కరణలతో రాబోయే 2-5 ఏళ్లలో భారత జిడిపి వృద్ధిరేటు 8-10 శాతానికి చేరుకోగలదని ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆర్థిక సర్వే 2015-16ను ప్రవేశపెట్టిన అనంతరం సుబ్రమణ్యన్ ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ప్రపంచ ఆర్థిక మందగమనం మధ్య భారత్ ఓ వెలుగు రేఖేనన్న ఆయన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) తదితర కీలక సంస్కరణల అమలు జిడిపి వృద్ధికి చాలా అవసరమన్నారు.
వడ్డీరేట్ల కోతలకు అవకాశం
ద్రవ్యోల్బణం అదుపులో ఉన్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను మరింతగా తగ్గించే అవకాశాలున్నాయని అరవింద్ సుబ్రమణ్యన్ అన్నారు. ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా ఆర్‌బిఐ ద్రవ్యసమీక్షలను నిర్వహిస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలో రిటైల్, హోల్‌సేల్ ద్రవ్యోల్బణం గణాంకాలు ప్రస్తుతం ఆమోదయోగ్య స్థాయిల్లోనే కదలాడుతున్నందున మున్ముందు సమీక్షల్లో కీలక వడ్డీరేట్లను ఆర్‌బిఐ తగ్గించడానికి వీలుందని సుబ్రమణ్యన్ అన్నారు.