ఆంధ్రప్రదేశ్‌

రేపటి నుంచి అహోబిలం బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, మార్చి 11: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం బ్రహ్మోత్సవాలు ఈ నెల 13న ప్రారంభం కానున్నాయి. అహోబిల మఠం పీఠాధిపతి శ్రీవన్ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి ఆధ్వర్యంలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ, దిగువ అహోబిలాల్లో 11 రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. 13న ఎగువ అహోబిలంలో అంకురార్పణ జరుగుతుంది. 14న ఉదయం ధ్వజారోహణం, రాత్రి సింహవాహన సేవ, అదే రోజు సాయంత్రం దిగువ అహోబిలంలో ఉత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాలు జరుగుతాయి.