కృష్ణ

మొక్కు‘బడి’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 7: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచి బలోపేతం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న పలు రకాల కార్యక్రమాల్లో ‘మన ఊరు - మన బడి’ ఒకటి. ప్రతి ఏటా పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చిన వెంటనే రాజీవ్ విద్యా మిషన్ ఆధ్వర్యంలో ‘మన ఊరు - మన బడి’ పేరుతో విద్యాశాఖ విద్యార్థులు, తల్లిదండ్రులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నా సత్ఫలితాలను మాత్రం రాబట్టలేకపోతున్నారు. 2016-17 విద్యా సంవత్సరానికి సంబంధించి గత ఏప్రిల్ 20 నుండి ఈ నెల 5 వరకు పక్షం రోజుల పాటు జిల్లావ్యాప్తంగా మన ఊరు - మన బడి కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించారు. ఊరూరా విద్యార్థులు, ఉపాధ్యాయులతో ర్యాలీ లు నిర్వహించినా ఆశించిన మేర ఫలితాలు అందుకోలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం స్ర్తి శిశు సంక్షేమ శాఖాధికారులు ఇచ్చిన ఐదేళ్ల వయస్సున్న విద్యార్థుల సమాచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమాన్ని మమ.. అనిపించారు. స్ర్తి శిశు సంక్షేమ శాఖాధికారుల లెక్కల ప్రకారం జిల్లా లో ఐదేళ్ల బాలల సంఖ్య 22 వేల 987 మంది. ఇందులో 17వేల 540 మంది విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశానికి అనుమతులు తీసుకున్నారు. ఇంకా 5వేల 447 మంది విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించాల్సి ఉంది. వీరిని కూడా త్వరలోనే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాధికారి ఎ సుబ్బారెడ్డి శనివారం ‘ఆంధ్రభూమి ప్రతినిధి’కి తెలిపారు. మన ఊరు - మన బడి కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెం చడం. బడి ఈడు పిల్లలను గుర్తించటంతో పాటు బడి బయట పిల్లలు, బాల కార్మికులను గుర్తించి వారిని ప్ర భుత్వ పాఠశాలల్లో చేర్పించాల్సిన బాధ్యత విద్యాశాఖాధికారులపై ఉంది. కానీ విద్యాశాఖాధికారులు మాత్రం కేవలం ఐసిడిఎస్ అధికారులు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్న చిన్నారుల సమాచారం మేరకు మన బడి కార్యక్రమాన్ని నిర్వహించారనే ఆరోపణలను మూటకట్టుకున్నారు. ఒకపక్క ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల సంఖ్య పెంచే విషయంలో వెంపర్లాడుతున్నారు. పాఠశాలలకు సెలవులు ఇచ్చిన మరుక్షణం నుండే ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు తమ పాఠశాలల ఉపాధ్యాయులను రంగంలోకి దించి ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులను బుట్టలో వేసుకుంటున్నారు. కానీ విద్యాశాఖాధికారులు మాత్రం ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యం, విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను తల్లిదండ్రులకు తెలియచేయడంలో విఫలమవుతున్నారు. ఏదిఏమైనా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చేపట్టిన మన ఊరు - మన బడి జిల్లాలో మొక్కుబడి తంతుగా ముగిసిందనడంలో ఏమాత్రం సందేహం లేదు.