కృష్ణ

నేడు రన్‌వే విస్తరణకు శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 11: నూతన రాజధాని అమరావతిలో గురువారం ఏనియేషన్ సమ్మిట్, విమానాశ్రయంలో నూతన టెర్మినల్ ప్రారంభోత్సవం, రన్ విస్తరణకు శంకుస్థాపన, సాయంత్రం పున్నమి, భవానీ ఘాట్లలో విమాన విన్యాసాలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ ఎయిర్ షో ఫైలట్లతో మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 12న గురువారం ఉదయం గేట్‌వే హోటల్ ఏవియేషన్ సమ్మిట్ నిర్వహించడం జరుగుతుందని, ఈ సమ్మిట్‌కు యుకె, ప్రాన్స్, నెదర్లాండ్స్ దేశాలకు చెందిన ప్రతినిధులు, మనదేశానికి సంబంధించి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తిస్‌ఘట్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు చెందిన 200లుకు పై విమానయాన కంపెనీలు సంబంధిత సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారన్నారు. ప్రత్యుష్‌కుమార్, ఎయిర్ బస్ ఇండియా యండి శ్రీనివాసన్ ద్వారకానాథ్ పాల్గొని ప్రసంగిస్తారన్నారు. ఈ సదస్సులో ఎటిఆర్, యంబ్రైరర్, ఫవన్ హాన్స్, ఎయిర్ కోస్తా, ట్రూజల్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొని ప్రసంగిస్తారన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం విమానాశ్రయంలో నూతన టెర్మినల్ ప్రారంభోత్సవం, రన్‌వే విస్తరణకు శంకుస్థాపనకు నిర్వహించడం జరుగుతుందన్నారు. అమరావతికి గేట్‌వేగా కొత్త టెర్మినల్ అత్యాధునిక సౌకర్యాలతో అత్యంత సుందరీకరణంగా తీర్చిదిద్దటం జరిగిందన్నారు. సాయంత్రం 4గంటల నుండి 4.30 గంటల వరకు పున్నమి, భవానీ ఘాట్లలో విమాన విన్యాసాలు ప్రదర్శించడం జరుగుతుందని, యునైటెడ్ కింగ్‌డమ్ దేశానికి చెందిన మార్క జఫ్‌రీ నాయకత్వంలోని గ్లోబల్ స్టార్స్ టీమ్ ఫైలట్స్ విన్యాసాలను ప్రదర్శిస్తారన్నారు.
జనవరి 13,14న ఉదయం 11 గంటల నుండి 11.15 గంటల వరకు సాయంత్రం 4.15 గంటల నుండి 4.30 గంటల వరకు విన్యాసాలు ప్రదర్శన ఉంటాయని, ఈ విన్యాసాలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ప్రజలు ఈ అద్భత విన్యాసాలను తిలకించాలని జిల్లా కలెక్టర్ బాబు.ఎ కోరారు. ఈ కార్యక్రమాలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రులు పూసపాటి అశోక్ గజపతిరాజు, యం.వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి, రాష్ట్ర మంత్రులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు. గ్లోబల్ స్టాల్స్ టీమ్ ఫైలట్స్ మార్క్ జఫ్‌రీస్, టాంకాసెల్స్, క్రిస్‌బర్కెట్, స్టీవ్‌కార్‌వెర్‌లు మాట్లాడుతూ ఇప్పటివరకు ఐదుసార్లు విమాన విన్యాసాలు ప్రదర్శించిన అనుభవం ఉన్నదన్నారు. ప్రస్తుతం అమరావతి రాజధానిలో ప్రదర్శించే విన్యాసాలు దక్షిణ భారతదేశంలో తొలి విమాన విన్యాస ప్రదర్శనలు అన్నారు. ఇక్కడ వాతావరణం విన్యాసాలకు అనుకూలంగా ఉందని, ఆకాశంలో పక్షులు ఎటువంటి ఆటకం లేకుండా ప్రశాంతంగా ఉందన్నారు. గ్లోబల్ స్టార్స్ బృందంలోని ఫైలట్లు మాథ్స్ టీచర్, కార్ రేస్ డ్రైవర్, మాజీ ఫైలట్‌తో పాటు 26 సంవత్సరాల యువకుడు మైకెల్ యున్నారని తాము ప్రదర్శించే ఈ విమాన విన్యాసాలు అత్యంత అద్భుతంగా ఉంటాయని ప్రజలందరూ ఈ ప్రదర్శనలను తిలకించవచ్చున్నారు.