రాష్ట్రీయం

ఆ నలుగురికేనా తెలంగాణ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూన్ 1: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సిఎం కెసి ఆర్ కుటుంబానికి చెందిన ఆ నలుగురికోసమేనా అని ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. తెలంగాణ ఎందుకు ఏర్పడిందో మూడేళ్లు గడిచిన తరువాత కూడా ఆ లక్ష్యం నెరవేరలేదని విమర్శించారు. తెలంగాణ ప్రజల కలలు సాకారం కావాలంటే, బంగారు తెలంగాణను సాధించాలంటే 2019లో కాంగ్రెస్‌కు అధికారం అప్పగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని అంబేద్కర్ మైదానంలో గురువారం సాయంత్రం జరిగిన ‘తెలంగాణ ప్రజాగర్జన’లో మాట్లాడుతూ, గత మూడేళ్లలో తెలంగాణ మొత్తం అభివృద్ధి జరగాలని తాను కూడా భావించడం లేదని, అయితే రాష్ట్ర అభివృద్ధికి సరైన ప్రణాళిక, సరైన మార్గం వేయలేదని ఆయన ఆరోపించారు. 1979లో ఇందిరాగాంధీ ఇదే మైదానం నుండి 1980సాధారణ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడంతో, 2019 ఎన్నికలకు రాహుల్ చేత కాంగ్రెస్ నేతలు ఇదే మైదానం నుండి ఎన్నికల శంఖారావం ప్రారంభింపచేశారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కెసిఆర్ ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేస్తూ, మోసం చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ‘నీరు, నిధులు, ఉద్యోగాలు’ అంశాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న కారణంతోనే ప్రత్యేక రాష్ట్రంకోసం పోరాటం జరిగిందని రాహుల్‌గాంధీ గుర్తు చేశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ మూడు అంశాల్లో ప్రజలకు న్యాయం చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. రైతులు, యువత, విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పోరాటం చేయడం వల్లనే నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం పార్లమెంట్‌లో చట్టం చేసి తెలంగాణను ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణ ఏర్పాటు చేసేందుకు తీవ్రమైన ప్రతిఘటన వచ్చినప్పటికీ, యుపిఎ-2 ప్రభుత్వం బెదరలేదని, సోనియాగాంధీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఇదే మైదానం నుండి గతంలో తన నానమ్మ ఇందిరాగాంధీ మాట్లాడుతూ, యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చి, పరిశ్రమల ఏర్పాటు ద్వారా లక్ష మందికి ఉపాధి కల్పించినట్టు గుర్తు చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం కూడా రెండుకోట్ల మంది యువతకు ఉద్యోగం కల్పిస్తామని హమీ ఇచ్చి, ఈ హామీని అమలు చేయలేకపోయిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉండగా, మార్కెట్ రేటుకు నాలుగు రెట్లు ధర అధికంగా ఇచ్చి, రైతుల సమ్మతి, గ్రామపంచాయితీల ఆమోదంతో భూములను తీసుకునేలా చట్టం రూపొందించామన్నారు. ఈ చట్టానికి కేంద్రంలో మోదీ ప్రభుత్వం, తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు చేసింది కేవలం కెసిఆర్ కుటుంబం కోసం కాదని, తెలంగాణ ప్రజలకోసం, తెలంగాణ అభివృద్ధి కోసమన్నారు. కెసిఆర్ కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తుల చేతుల్లోనే ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. కెసిఆర్ 350 కోట్ల ప్రజాధనంతో సొంత అవసరాలకోసం ఇల్లుకట్టుకున్నారని, ప్రజలకు మాత్రం మేలు చేయడం మరిచిపోయారని విమర్శించారు.
గత మూడేళ్లలో తెలంగాణలో 2855 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, కేవలం కెసిఆర్ నియోజకవర్గంలోనే 100 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రాహుల్ ఆరోపించారు. తెలంగాణను రైతుల స్మశానంగా మారుస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. గతంలో తమ ప్రభుత్వం ఒకేసారి 72 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిందని, మళ్లీ రైతులకు వెంటనే రుణాలు ఇచ్చామని గుర్తు చేశారు. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ తెలంగాణ సాకారం కావడం లేదని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇవి సాకారం అవుతాయన్నారు. ప్రస్తుతం మొబైల్‌ఫోన్, దుస్తులు తదితర వస్తువులపై మేడ్ ఇన్ చైనా అని ఉంటోందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ తెలంగాణ అని ఉంటుందని పేర్కొన్నారు.
చిత్రం: సంగారెడ్డి బహిరంగ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న రాహుల్ గాంధీ