బిజినెస్

మొబైల్ టవర్లను అమ్మేసిన ఆర్‌కామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటర్-సిటి, ఇంట్రా-సిటి ఆప్టిక్ ఫైబర్ ఆస్తులూ విక్రయం
రూ. 30,000 కోట్లకు కొనుగోలు చేసిన తిల్మన్, టిపిజి సంస్థలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: అనీల్ అంబానీ నేతృత్వంలోని టెలికాం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్).. తమ సెల్యులార్ (మొబైల్) టవర్లను ప్రైవేట్ ఈక్విటీ సంస్థ తిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ ఎల్‌ఎల్‌సి, టిపిజి ఆసియా సంస్థలకు అమ్మేసింది.
22,000 కోట్ల రూపాయలకు ఈ టవర్లను ఆర్‌కామ్ విక్రయించింది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఇంటర్-సిటి, ఇంట్రా-సిటి ఆప్టిక్ ఫైబర్ ఆస్తులనూ రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఈ సంస్థలకు 8,000 కోట్ల రూపాయలకు అమ్మేసింది. ఈ నిధులతో సంస్థ రుణ భారాన్ని 75 శాతం తగ్గించుకోనుంది. ఆర్‌కామ్‌కు 39,894 కోట్ల రూపాయల రుణ భారం ఉండగా, ఈ డీల్ నేపథ్యంలో జరిగే చెల్లింపులతో ఇది 10,000 కోట్ల రూపాయల దిగువకు పడిపోనుంది. అంతేగాక ప్రస్తుతం తమ రుణాలపై సుమారు 3,600 కోట్ల రూపాయల వడ్డీని ఆర్‌కామ్ చెల్లిస్తోంది.
ఇప్పుడిది 85 శాతం తగ్గి 600 కోట్ల రూపాయలకు పడిపోనుండగా, భారతీయ టెలికాం రంగ సంస్థల్లో అత తక్కువ రుణ భారం కలిగిన సంస్థల్లో ఆర్‌కామ్ ఒకటిగా నిలవనుంది. కాగా, దేశవ్యాప్తంగా ఆర్‌కామ్‌కు 43,379 టవర్లున్నాయి. 2013లో తన అన్న ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోతో టవర్ల భాగస్వామ్యానికిగానూ 15 ఏళ్ళపాటు ఓ ఒప్పందాన్ని కూడా అనీల్ అంబానీ కుదుర్చుకున్నారు. దీని విలువ 12,000 కోట్ల రూపాయలు.