రాష్ట్రీయం

బిసిల ఐక్యత దెబ్బ తీసేందుకే క్రీమీ లేయర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య మండిపాటు

హైదరాబాద్/ఖైరతాబాద్, డిసెంబర్ 24: తెలంగాణ రాష్ట్రంలోని బిసిల ఐక్యతను దెబ్బతీసేందుకే సిఎం కేసిఆర్ క్రీమీ లేయర్‌ను తెరపైకి తీసువచ్చారని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోక్రీమీ లేయర్‌పై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి కృష్ణయ్య, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, టిడిపి నేత అరవింద్‌కుమార్ గౌడ్, ప్రొఫెసర్ విశే్వశ్వరరావుతదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు తెలంగాణ ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. అగ్రకుల దురహంకారంతో కేసిఆర్ క్రీమీ లేయర్‌ను తీసుకురావాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. సుమారు 70ఏళ్ల స్వాతంత్య్ర భారతావనిలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న బిసిలను పాతాళానికి అణగదొక్కేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. క్రీమీ లేయర్‌ను అమలు చేయాల్సి వస్తే మొదట ఓసిల్లో అమలు చేయాలని అన్నారు. ఎమ్మెల్యే, ఎంపి, సిఎం పదవులకు సైతం క్రీమీ లేయర్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ ఇంట్లో ముగ్గురు మంత్రి పదవులు అనుభవిస్తూ బిసిలకు మాత్రం క్రీమీ లేయర్ వర్తింప చేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు.
జనాభా దామాషా ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం ఉండాల్సి ఉండగా, కేవలం 7 శాతం మాత్రమే బిసిలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే రీతిలో చట్టసభల్లో 12శాతం ఉన్నారని అన్నారు. దీనిని బట్టి బిసిలకు ఎంత అన్యాయం జరిగిందో చెప్పవచ్చునని వారు పేర్కొన్నారు.
కేసిఆర్ ప్రభుత్వ బిసి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 27 పదిజిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలతోపాటు 30 హైదరాబాద్ నగరంలో మహా నిరసనలు చేస్తామని వారు హెచ్చరించారు.