జాతీయ వార్తలు

అయోధ్య కేసులో రాజీవ్ ధావన్‌పై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అయోధ్య కేసులో రివ్యూ పిటిషన్ వేసిన జమాతే ఉలేమా తన పిటిషన్‌పై వాదించటానికి మరో న్యాయవాదిని ఏర్పాటుచేసుకుంది. ఇప్పటి వరకు వక్ఫ్‌బోర్డు తరపున వాదించిన సీనియర్ అడ్వకేటు రాజీవ్ ధావన్‌ను తప్పించింది. ఆ కేసు నుంచి ఆయ‌న్ను తొల‌గిస్తున్న‌ట్లు జ‌మాతే త‌ర‌పున వాదిస్తున్న‌ అడ్వ‌కేట్ ఇజాజ్ మ‌క్బూల్ తెలిపారు. మ‌క్బూల్ త‌న ఫేస్‌బుక్‌లో ఈ విష‌యాన్ని చెప్పారు. రివ్యూ పిటిష‌న్‌లో ధావ‌న్ ఉండ‌ర‌ని చెప్పారు. త‌న‌ను తొల‌గించ‌డానికి కార‌ణాలు స‌రిగా లేవ‌ని ధావ‌న్ అన్నారు. అయోధ్య కేసులో అయిదుగురు స‌భ్యుల సుప్రీం ధ‌ర్మాస‌నం ఇటీవ‌ల 40 రోజుల పాటు విచారించిన విష‌యం తెలిసిందే. ఆ కేసులో ముస్లింల త‌ర‌పున రాజీవ్ ధావ‌న్ సుమారు రెండు వారాల పాటు వాదించారు. ఆరోగ్యం కార‌ణాల‌తో త‌న‌ను తొల‌గించ‌డం స‌రిగాలేద‌ని అన్నారు.