బిజినెస్

పరిశ్రమలకు గోదావరి జలాలు బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రబీ సాగుకు నీటి కొరత రాకూడదనే నిలిపివేత

రాజమండ్రి, డిసెంబర్ 29: గోదావరి జిల్లాల్లోని పరిశ్రమలకు సరఫరా చేస్తున్న గోదావరి జలాలను మంగళవారం నుండి జలవనరుల శాఖ అధికారులు నిలిపివేశారు. ఉభయగోదావరి జిల్లాల్లోని డెల్టాలో రబీ సాగుకు నీటి కొరత రాకుండా ముందుజాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ ఎస్‌ఇ ఎన్ సుగుణాకరరావు చెప్పారు. పరిశ్రమలకు సరఫరా చేస్తున్న నీటితోపాటు బ్యారేజికి ఎగువన ఉన్న వివిధ ఎత్తిపోతల పథకాలు, పంపింగ్ స్కీంలను ఇప్పటికే నిలిపి వేశామని, విశాఖ నగర పాలక సంస్థకు తాగునీటిని సరఫరా చేస్తున్న విస్కో ఎత్తిపోతల పథకాన్ని కూడా నిలిపి వేయించినట్టు ఎస్‌ఇ చెప్పారు. గోదావరి డెల్టాలో జనవరి 10 వరకు నాట్లు కొనసాగుతాయని అంచనా వేస్తున్నామన్న ఆయన నాట్లు పూర్తయ్యే వరకు పరిశ్రమలకు, విశాఖ తాగునీటి అవసరాలకు కూడా నీటి సరఫరా ఆపేయాలని భావిస్తున్నామన్నారు. రబీకి ఎలాంటి సాగునీటి సమస్య రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, రబీ పంటను కాపాడేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పంట పొలాల నుండి డ్రెయిన్లలోకి వెళ్లిన నీటిని తిరిగి వినియోగించుకునేందుకు వీలుగా 600 చోట్ల అడ్డుకట్టలు ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, దీనికి సుమారు 4.5 కోట్ల రూపాయలు ఖర్చవుతుందన్నారు. అలాగే దొంగరావిపాలెం, వేమగిరి, వెలిచేరు, తాతపూడి తదితర 14 ప్రాంతాల్లో పంపులు ఏర్పాటుచేసి గోదావరి జలాలను పంపింగ్ చేసేందుకు 4.80 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు.
కాగా, రైతులు ఎక్కడయినా బోర్లు తవ్వుకుంటే, వాటి నుండి నీటిని తోడేందుకు అవసరమైన డీజిల్‌ను సరఫరా చేస్తామని ఎస్‌ఇ సుగుణాకరరావు చెప్పారు. ఇలా గోదావరి డెల్టాలో పూర్తి ఆయకట్టుకు సాగునీటిని సరఫరా చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అయతే మెరక ప్రాంతాల్లోని పంట పొలాలకు ఇప్పుడున్న పరిస్థితుల్లో నీటిని సరఫరాచేయటం కష్టమవుతుందని మొదటి నుండి చెబుతున్నామని, ఇదే విషయాన్ని ఐఎబి సమావేశంలో కూడా చెప్పామన్నారు. మెరక ప్రాంతాలకు నీటిని సరఫరా చేసేందుకు అవసరమైన నీటిమట్టాన్ని కాలువల్లో నిర్వహించలేకపోతున్నామన్నారు. ఇలాంటి పరిస్థితిని తాము మొదటి నుండి చెప్పటం వల్ల పిబిసి ఆయకట్టులోని సుమారు 18 వేల ఎకరాల్లో రైతులు మినపప్పు వంటి పప్పు ధాన్యాల సాగును చేపట్టారని, ఇప్పుడా రైతులు సంతృప్తికరంగా ఉన్నారన్నారు. మెరక ప్రాంతాల్లోని రైతులు కాలువల నుండి నీటిని తోడుకునేందుకు ముందుకొస్తే, అందుకు అవసరమైన నిధులను సమకూరుస్తామని కూడా తెలిపారు. నాట్లు పూర్తయిన వెంటనే వంతుల వారీ విధానాన్ని అమలు చేస్తామని ఎస్‌ఇ అన్నారు.