జాతీయ వార్తలు

పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీహరికోట: 20 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) బుధవారం మరో చరిత్ర సృష్టించింది. ఉదయం 9.26గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ థావన్‌ అంతరిక్ష కేంద్రం(షార్‌) నుంచి పీఎస్‌ఎల్‌వీ సి-34 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. భారత్‌కు చెందిన కార్టోశాట్‌-2సి, మన దేశ విద్యా సంస్థలకు సంబంధించిన రెండు ఉప గ్రహాలు, అమెరికా, కెనడా, జర్మనీ, ఇండోనేషియాకు చెందిన 17 ఉప గ్రహాలను వాహకనౌక నింగిలోకి మోసుకెళ్లింది. వీటిలో ప్రధానమైనది కార్టోశాట్‌-2సి. దీని బరువు 727.5 కిలోలు, 20 ఉప గ్రహాల మొత్తం బరువు 1,288 కిలోలు, గూగుల్‌కు చెందిన 110 కిలోల స్కైశాట్‌ కూడా వీటిలో ఉంది. పీఎస్‌ఎల్‌వీ సి-34 ప్రయోగం విజయవంత కావడంతో శాస్త్రవ్తేతలు హర్షం వ్యక్తం చేశారు. ఎంసీసీ నుంచి ఇస్రో అధిపతి కిరణ్‌కుమార్‌, సీనియర్‌ శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని వీక్షించారు. పీఎస్‌ఎల్‌వీ వాహక నౌక మూడు దశలు విజయవంతంగా పూర్తి చేసింది. నింగిలోకి చేరిన పీఎస్‌ఎల్‌వీ ఉప గ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టేందుకు 26 నిమిషాల సమయం పట్టింది